Balakrishna: బాలయ్య గోపీచంద్ మూవీ అలా ఉండనుందా?

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న బాలయ్య త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాను ఫాలో కానున్నారని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో ఫైట్ సీన్లతో పాటు ఎలివేషన్ సీన్లు కూడా ఎక్కువగానే ఉండనున్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తుండగా సినిమాలో ఫస్టాఫ్ లోనే మూడు ఫైట్లు ఉంటాయని ఆ ఫైట్లలో ఒక ఫైట్ షూటింగ్ విదేశాల్లో జరగనుందని తెలుస్తోంది. అమెరికాలో ఈ ఫైట్ సీన్ ను షూట్ చేయనున్నారని బోగట్టా. విదేశాలలో ఫ్యాక్షనిస్ట్ ఫైట్ గా ఈ ఫైట్ ఉంటుందని తెలుస్తోంది.

విదేశాలలో కత్తులు, గొడ్డళ్లతో ఫైట్ చేస్తూ బాలయ్య ఈ సినిమాలో రచ్చ చేస్తారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఫ్యాక్షన్ సినిమాలతో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న బాలయ్య ఈ సినిమాతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు. బాలయ్య సోదరిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. బాలయ్య తర్వాత సినిమాలతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus