Neeraj Chopra: ఒలింపిక్స్‌ స్వర్ణ పతక వీరుడు నీరజ్‌ చోప్రా మనసులో మాట!

క్రీడాకారుల బయోపిక్స్‌ తీయడం బాలీవుడ్‌కి బాగా అలవాటు. ఏదైనా రంగంలో విజేతగా నిలిస్తేనో, ప్రజల మన్ననలు పొందితేనో వారి కథను వీలైనంత ఎక్కువమందికి చూపించడానికి బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ఎదురుచూస్తుంటారు. మరిప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన నీరజ్ చోప్రాపై బయోపిక్ తీసే అవకాశం కొట్టి పారేయలేం. అందులోనూ కమర్షియల్‌ సినిమాకు కావల్సిన చాలా హంగులు ఆయన జీవితంలో ఉన్నాయి కూడా. జావెలిన్‌ త్రోలో దేశానికి స్వర్ణపతకం తీసుకొచ్చారు నీరజ్‌ చోప్రా.

దీంతో వందేళ్ల భారతదేశ కల నెరవేరింది. రజతం, కాంస్యం తప్ప స్వర్ణం ఎరుగని భారత్‌ కోరికను నెరేవర్చాడు. ఆ ఘనత తర్వాత నీరజ్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో కొంతమంది అతని బయోపిక్‌ గురించి ప్రస్తావించారు. ఒకవేళ మీ బయోపిక్ తీస్తే హీరోగా ఎవరు చేస్తే బాగుంటుంది అని నీరజ్‌ను అడిగారు. ఆ మాటకు నీరజ్‌ భలే సమాధానం ఇచ్చాడు. ఒకవేళ తనపై బయోపిక్ తీస్తే రణదీప్‌ హుడా కానీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కానీ తీయాలని అనుకుంటున్నట్టుగా చెప్పాడు నీరజ్‌.

అయితే తాను అక్షయ్ కుమార్‌కి పెద్ద అభిమానిని చెప్పాడు నీరజ్‌. మరి ఈ బంగారు బుల్లోడు అయితే తన మనసులో మాట చెప్పాడు. మరి అతని కథ రాసి, ఏ హీరోను పట్టుకుంటారో మన దర్శకనిర్మాతలు చూడాలి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus