రెండు నెగిటివ్‌లు ఒక పాజిటివ్ అవుతాయి అంటుంటారు. అయితే విజయ్ దేవరకొండ విషయంలో ఒక నెగిటివ్ అయినా.. పాజిటివ్‌గా మారిపోతుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. విజయ్ దేవరకొండ కెరీర్‌ను పట్టి చూస్తే కెరీర్‌లో విమర్శలు, కాంట్రవర్శీలు సినిమాకు బాగానే సహకరిస్తుంటాయి. గతంలో జరిగినవేంటి అనేది తర్వాత చూస్తే.. ఇప్పుడు ‘లైగర్’ విషయంలో ఓ చిన్న కాంట్రవర్శీ తెలుగు మీడియాలో విజయ్ పేరు మారుమోగేలా చేస్తోంది. ‘లైగర్’ సినిమా ప్రచారంలో భాగంగా విజయ్ దేవరకొండ ఇటీవల హైదరాబాద్ వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టాడు.
కథానాయిక అనన్య పాండేతో కలసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడాడు. ఈ క్రమంలో ఓ విలేకరి మీరు స్టార్ అయిపోయారు కదా.. మీతో అప్పటిలా మాట్లాడలేకపోతున్నా అని అంటే.. ‘కూల్‌గా మాట్లాడండి.. ఏముంది మీ విజయ్‌నే’ అంటూ కాళ్లు మీడియా ముఖాన పెట్టి కూర్చున్నాడు. అయితే అది అక్కడ సిట్యువేషన్‌ను సరదా చేయడానికి అని విజయ్ టీమ్ చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని ఓ టీవీ మీడియా ప్రతినిధి వివరంగా విశ్లేషించారు కూడా.
తాజాగా ఆ వీడియోను ట్వీట్ చేస్తూ.. విజయ్ తన ‘మర్యాద’ వెనుకున్న కారణాన్ని నీతి వాక్యాలతో చెప్పాడు. దీంతో వివాదం సద్దుమణిగింది అని అంటున్నారు. వివాదం సద్దుమణిగిందా లేదా అనేది పక్కన పెడితే.. ఈ విషయం పట్టుకుని విజయ్ దేవరకొండ టీమ్ తెలుగు మీడియాలో ‘లైగర్’ ప్రచారం గట్టిగా చేసుకుంటోంది. అలా నెగిటివ్‌ని పాజిటివ్ చేసుకుంటున్నారు. విజయ్ యాటిట్యూడ్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రౌడీస్ అంటూ తన అభిమానుల్ని విజయ్ ఆకాశానికెత్తేస్తుంటాడు.
మీడియాలో కొంతమంది విజయ్ యాటిట్యూడ్‌ని మెచ్చుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే యాటిట్యూడ్ రూపంలో తన ఆలోచనల్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు అని కూడా అంటుంటారు. ఇక్కడ విజయ్ చేసింది కరెక్టా? కాదా అనేది విజయ్‌కే తెలియాలి. ఎందుకంటే ఆయన కాళ్లు ఆయన ఇష్టం. ఎలా అయినా పెట్టుకుని కూర్చోవచ్చు. అయినా ఓ డౌట్. ఈ సినిమా ప్రచారానికి హైదరాబాద్‌లో పూరి జగన్నాథ్ ప్రెస్ మీట్ పెట్టలేదు ఏంటబ్బా?
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?