దర్శకుడు సన్నివేశాలను ఎంత అద్భుతంగా తెరకెక్కించినా బీజీఎం బాగా లేకపోతే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు తక్కువని చెప్పవచ్చు. అలా కాకుండా పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు తమ బీజీఎంతో సాధరణ సన్నివేశాలను సైతం మరో స్థాయికి తీసుకెళ్లారు. అఖండ, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల విజయాలలో బీజీఎం కూడా కీలక పాత్ర పోషించిందనే సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా విడుదలకు ముందు ఈ సినిమా బీజీఎంకు సంబంధించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
మణిశర్మ ఇచ్చిన బీజీఎం కొరటాల శివకు నచ్చలేదని ఆ తర్వాత మిక్కీ జే మేయర్ ఎంట్రీ ఇవ్వగా ఆయన బీజీఎం కూడా నచ్చకపోవడంతో మహతి స్వరసాగర్ ఈ సినిమా బీజీఎం కోసం పని చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే కొరటాల శివ థమన్ కు ఛాన్స్ ఇచ్చి ఉంటే ఆచార్య రిజల్ట్ మారేదని నెటిజన్లు భావిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన థమన్ అఖండ సినిమాలో కొన్ని సన్నివేశాలకు తన బీజీఎంతో ప్రాణం పోశారు.
ఆచార్య బీజీఎం కోసం థమన్ ను దర్శకుడు కొరటాల శివ ఎందుకు సంప్రదించలేదో తెలియాల్సి ఉంది. సాధారణంగా కొరటాల శివ ప్రతి సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడిగా వ్యవహరించేవారు. ఆచార్య బీజీఎం మాత్రం సినిమాకు చాలా మైనస్ అయిందని చెప్పవచ్చు. శని, ఆదివారాలలో ఈ సినిమాకు కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఈ ఏడాది విడుదలై నిరాశపరిచిన సినిమాల జాబితాలో ఆచార్య సినిమా కూడా ఉండటం గమనార్హం.
రీఎంట్రీలో కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న చిరంజీవి ఆచార్య కథకు ఏ విధంగా ఓకే చెప్పారని మరి కొందరు సందేహాలను వ్యక్తం చేశారు. ఆచార్య కథలో చేసిన మార్పులే ఈ సినిమా రిజల్ట్ కు కారణమని మరి కొందరు సందేహాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఆచార్య కొంతమేర నష్టాలను మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!