Prabhas: ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ డేట్ మారే ఛాన్స్.. కానీ?

స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమాల షూటింగ్ లు అన్నీ పూర్తై కొన్ని నెలల గ్యాప్ లో మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల బడ్జెట్లు వేర్వేరుగా దాదాపుగా సమానం అనే సంగతి తెలిసిందే. ఆదిపురుష్ మూవీ జూన్ నెల 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి ఎలాంటి మార్పు లేదనే సంగతి తెలిసిందే.

అయితే ఆదిపురుష్ రిలీజైన మూడు నెలలకే సలార్, సలార్ రిలీజైన మూడు నెలలకు ప్రాజెక్ట్ కే రిలీజ్ కానున్నాయని వచ్చిన వార్తలు అభిమానులను ఒకింత టెన్షన్ పెడుతున్నాయి. ప్రభాస్ సినిమాలకు సాధారణంగా టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాల బడ్జెట్లు భారీగా ఉండటంతో ప్రేక్షకులు కూడా అన్ని సినిమాలను చూడటం సులువు కాదు. ఈ సినిమాలలో కనీసం రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలుస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ప్రభాస్ (Prabhas) భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఒక సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాలు రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీ పీపుల్స్ మీడియా బ్యానర్ పై తెరకెక్కుతోంది.

త్వరలో స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది. టీ సిరీస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఈ సినిమాను నిర్మించనుంది. ప్రభాస్ తో పీపుల్స్ మీడియా వరుస సినిమాలను నిర్మిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రాబోయే రోజుల్లో ప్రభాస్ కు వరుస విజయాలు దక్కాలని ఆయన తన సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus