ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ (Allu Arjun).. జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ..ని కాదని నంద్యాల వెళ్లి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసిన శిల్పా రవికి మద్దతు తెలుపుతూ అతన్ని గెలిపించాలని ప్రచారం చేసి వచ్చాడు. ఇది జన సైనికులకు గాని, పవన్ అభిమానులకి గాని అస్సలు నచ్చలేదు. ఎన్నికలు ముగిశాక ఈ విషయంపై నాగబాబు (Naga Babu) తన సోషల్ మీడియాలో బన్నీపై అసంతృప్తిని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత జనసేన పార్టీకి చెందిన వారు కూడా బన్నీ తీరుని వ్యతిరేకించారు.
ఆ టైంలో ‘నా స్నేహితులు ఏ పార్టీలో ఉన్నా సరే నేను వెళ్తాను’ అంటూ అల్లు అర్జున్ చెప్పడం.. వారిని మరింతగా రెచ్చగొట్టినట్టు అయ్యింది. అక్కడితో ఆగలేదు.. ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ (Maruthi Nagar Subramanyam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి.. అక్కడ కూడా పవన్ ఫ్యాన్స్ ని, జనసైనికులని రెచ్చగొట్టి వచ్చాడు బన్నీ. దీంతో ‘పుష్ప 2’ ని (Pushpa 2) చూడమంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం జరిగింది.
అయితే నిన్న ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది. కాబట్టి ‘పుష్ప 2’ భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మెగా అభిమానులు కూడా ‘పుష్ప 2 ‘ ట్రైలర్ చూసి చల్లబడ్డారు అనిపిస్తుంది.గతంలో ‘డీజే'(దువ్వాడ జగన్నాథం) (Duvvada Jagannadham) ట్రైలర్ పై వచ్చిన నెగిటివిటీ అయితే ‘పుష్ప 2’ ట్రైలర్ విషయంలో కనిపించలేదు.
సినిమా కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే.. వాళ్ళు పూర్తిగా చల్లబడినట్టే..! ఎటొచ్చి.. ‘పుష్ప 2’ ట్రైలర్ పై మెగా హీరోలు స్పందించలేదు. అల్లు అర్జున్ పై ఉన్న కోపాన్ని వాళ్ళు ఈ విధంగా బయట పెట్టారేమో అనిపిస్తుంది. చూడాలి మరి వాళ్ళు కూడా ‘పుష్ప 2’ రిలీజ్ టైంకి చల్లబడతారేమో.