Neha Shetty: ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఫేవరెట్ అంటున్న నేహాశెట్టి.. ఏ సినిమా అంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో నేహాశెట్టి (Neha Shetty) ఒకరు కాగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. డీజే టిల్లు (Dj Tillu) , టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమాలతో నేహాశెట్టి ఆమె నటించిన ప్రతి రోల్ కు న్యాయం చేస్తూ ఎంతో ఆకట్టుకుంటున్నారనే చెప్పాలి. నేహాశెట్టికి సోషల్ మీడియా వేదికగా క్రేజ్ పెరుగుతుండగా స్టార్స్ కు జోడీగా ఛాన్స్ వస్తే నేహాశెట్టి కెరీర్ కు మరింత ప్లస్ అవుతుంది. తాజాగా నేహాశెట్టి నెటిజన్లతో ముచ్చటించగా ఒక నెటిజన్ నేహాశెట్టి ఫేవరెట్ మూవీ ఏదని అడిగారు.

ఆ ప్రశ్న గురించి నేహాశెట్టి స్పందిస్తూ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) తన ఫేవరెట్ మూవీ అని ఆమె అన్నారు. నేహాశెట్టి తను నటించిన సినిమాల గురించి కాకుండా మరో హీరో సినిమా గురించి ప్రస్తావించడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నేహాశెట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమాతో ఇటీవల మరో హిట్ అందుకున్నారు. హైదరాబాద్ నా ఫేవరెట్ సిటీ అని నేహాశెట్టి పేర్కొన్నారు. బ్లూ కలర్ ఎంతో ఇష్టమని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు.

నేహాశెట్టి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నేహాశెట్టి ఇతర భాషల్లో సైతం అంచనాలకు మించి సక్సెస్ సాధించి కెరీర్ పరంగా మరింత ఎదుగుతారేమో చూడాల్సి ఉంది. నేహాశెట్టిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని ఫ్యాన్స్చె బుతున్నారు. నేహాశెట్టి టాలెంట్ కు తగ్గ ఆఫర్లు రాబోయే రోజుల్లో వస్తాయేమో చూడాల్సి ఉంది. నేహాశెట్టి సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారని చెప్పవచ్చు.

నేహాశెట్టి పారితోషికం అరకోటి రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది. నేహాశెట్టి నెక్స్ట్ కథలకు ప్రాధాన్యత ఇస్తే ఆమెకు కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు. నేహాశెట్టి రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. యంగ్ హీరోలకు ఆమె బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus