ఒకప్పుడు హీరోయిన్ అంటే కధలో మంచి పాత్ర కలిగి, ఆ కధను డ్రైవ్ చెయ్యగలిగే కెప్యాసిటీ ఉండే క్యారెక్టర్ గా ఫేమస్ అనే చెప్పాలి. అయితే అదే క్రమంలో నేటి తరం హీరోయిన్స్ అంటే కేవలం…సినిమాలో పాటలకు, హీరోస్ తో రొమ్యాన్స్ కు, ఇంకా చెప్పాలి అంటే హీరో పక్కన ఒక పాత్రకు అని తప్ప, వేరే ప్రత్యేకత ఏమీ ఉండడం లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హీరోయిన్స్ పరిస్థితి ఏంటి అంటే టకా…టకా ముంబై నుంచి వచ్చామా? ఓ నాలుగు అయిదు సినిమాలు చేశామా…రిటర్న్ ఫ్లైట్ లో వెళ్ళిపోయి ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయామా ఇది ప్రస్తుతం హీరోయిన్ పరిస్థితి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా 10ఏళ్ల కరియర్ ను పూర్తి చేసుకుంది మన అందాల భామ కాజల్ అగర్వాల్…ఈ సంవత్సరంతో కాజల్ సినీ అరంగేట్రం చేసిన దశాబ్దం పూర్తి కావస్తోంది. ఒక హీరోయిన్ పదేళ్ల పాటు కెరీర్ కంటిన్యూ చేయగలగడం.. అది కూడా టాప్ రేంజ్ స్టార్ హీరోయిన్ అనే బిరుదును కాపాడుకోగలగడం చాలా అరుదైన విషయం.
అయితే ఇక్కడ ఇంకో ట్విష్ట్ ఏంటి అంటే….ఈ పదేళ్లలో కాజల్ చేసిన సినిమాల కౌంట్ ఎంతో తెలుసా…. ప్రస్తుతం రానా హీరోగా వస్తున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో కలసి… కాజల్ మొత్తం 50సినిమాలు చేసి హాఫ్ సెంచురీ పూర్తి చేసిన హీరోయిన్ గా ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది….ఇక పదేళ్లలో 50 సినిమాలు.. అంటే ఏడాదికి ఐదేసి సినిమాల చొప్పున చేసుకుంటూ వచ్చేస్తోంది ఈ 32 ఏళ్ల బ్యూటీ. కెరీర్ 10 ఏళ్లు పూర్తి కావడం.. హాఫ్ సెంచరీ మూవీ కావడంతో పాటు.. తన మొదటి దర్శకుడు అయిన తేజతోనే.. 50వ సినిమా కూడా చేస్తుండడం ఒకరకంగా అదృష్టం అనే చెప్పాలి…ఏది ఏమైనా…మిగిలిన భామలు కూడా కాజల్ లా మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోవాలి అని కోరుకుందాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.