“నేనెవరు” ఫస్ట్ సాంగ్ ‘నిలువవే’ లాంచ్ చేసిన హీరో శివ బాలాజీ!!

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై.. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేనెవరు’. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. సెల్వ రాఘవ దర్శకత్వంలో రూపొంది.. మంచి విజయం సాద్జించిన ‘నన్ను వదలి నీవు పోలేవులే’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన కోలా బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో సాక్షి చౌదరి హీరోయిన్. తనిష్క్ రాజన్-గీత్ షా సహాయ పాత్రలు పోషిస్తుండగా… బాహుబలి ప్రభాకర్ విలన్. ఇటీవల విడుదలైన ‘నేనెవరు’ ఫస్ట్ లుక్ కి చాలా మంచి స్పందన వచ్చింది.

కాగా… ఈ చిత్రం నుంచి ‘నిలువవే’ అనే పాటను వెర్సటైల్ ఆర్టిస్ట్ శివ బాలాజీ రిలీజ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం పాటలు లభ్యం కానున్నాయి. ఆర్.జి.సారధి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణకాంత్ సాహిత్యం సమకూర్చారు. హేమచంద్ర పాడారు.

శివ బాలాజీ మాట్లాడుతూ… ‘పాటలో పెయిన్ తోపాటు మంచి ఫీల్ ఉంది. ఇంత మంచి పాటను నేను రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న సారధికి, హీరోగా బాలకృష్ణకి చాలా మంచి పేరు రావాలి’ అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న హీరో కోలా బాలకృష్ణ, సంగీత దర్శకుడు ఆర్.జి.సారధి… ‘ఆర్య, చందమామ’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శివ బాలాజీ తమ చిత్రంలోని పాటను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, ఫైట్స్: రియల్ సతీష్, కొరియోగ్రఫీ: చంద్రకిరణ్.జె, పి.ఆర్.ఓ: ధీరజ్ అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: వాల్స్ అండ్ ట్రెండ్స్, పోస్ట్ ప్రొడక్షన్: ప్రసాద్ లాబ్స్, ఎడిటింగ్: కోలా భాస్కర్, సంగీతం: ఆర్.జి.సారధి, సహనిర్మాతలు: పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి, నిర్మాతలు: భీమినేని శివప్రసాద్- తన్నీరు రాంబాబు, దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి!!


ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus