అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా శ్రియ శరణ్ (Shriya Saran), ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal)..లు హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘నేనున్నాను’ (Nenunnanu) . సీనియర్ స్టార్ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య (V. N. Aditya) తెరకెక్కించిన ఈ సినిమా 2004 ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యింది. నాగార్జునకి హోమ్ బ్యానర్ అయినటువంటి ‘కామాక్షి మూవీస్’ సంస్థపై డి. శివప్రసాద్ రెడ్డి (D. Siva Prasad Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి (M. M. Keeravani) సంగీతంలో రూపొందిన ‘ఏ శ్వాసలో చేరితే’ ‘నేనున్నానని నీకేం కాదని’ ‘ఇంత దూరం వచ్చాక’ ‘నీకోసం నీకోసం’ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
తొలిరోజు సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. కామెడీ కూడా వర్కౌట్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా చూశారు. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఒకసారి ఫుల్ రన్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 5.05 cr |
సీడెడ్ | 1.70 cr |
ఉత్తరాంధ్ర | 2.08 cr |
ఈస్ట్ | 0.89 cr |
వెస్ట్ | 0.84 cr |
గుంటూరు | 1.03 cr |
కృష్ణా | 1.01 cr |
నెల్లూరు | 0.61 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 13.21 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.81 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 14.02 cr |
‘నేనున్నాను’ సినిమా రూ.11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో రూ.14.02 కోట్ల షేర్ ను రాబట్టి.. క్లీన్ హిట్ గా నిలిచింది. బయ్యర్లకు రూ.3 కోట్ల లాభాలు పంచింది ఈ సినిమా.