NET Teaser: ఆకట్టుకుంటున్న అవికా గోర్ ‘నెట్’ టీజర్..!

రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘నెట్’ మూవీ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న జీ5 ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. టెక్నాలజీ వినియోగం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వాడకం కూడా అదే విధంగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో మోసాలు, బ్లాక్ మెయిల్ లు వంటివి కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. స్పై కెమెరాలతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాలకు అంతే లేకుండా పోతుంది. అలాంటి వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ ‘నెట్’ తెరకెక్కింది. ‘తమడా మీడియా’ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం.

భార్గవ్ మంచర్ల ఈ మూవీకి దర్శకుడు. ‘నెట్’ ద్వారా తొలిసారి ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతుంది హీరోయిన్ అవికా. ఇక ‘నెట్’ కు సంబంధించిన టీజర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. నటుడు రాహుల్ రామకృష్ణ పాత్ర సీరియస్ గా.. అతని భార్యకు తన ఫోన్ ముట్టుకోవద్దని వార్ణింగ్ ఇస్తుండడం మనం గమనించవచ్చు. మరోపక్క వేరేచోట ఉన్న హీరోయిన్ అవికా గోర్ ను కనిపెడుతూ వస్తున్నాడు.ఆమె ఏం చేస్తుందా అని తన ఫోన్లో చూస్తున్నాడు.

‘మనల్ని ఎవరు చూస్తున్నారో.. ఎవరు గమనిస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం’ అనే థీమ్ తో ఈ టీజర్ ను కట్ చేశారు. చివర్లో రాహుల్ రామ కృష్ణ కంగారుగా ‘మీ ఇంట్లో ఉన్నాడు.. మీ ఇంట్లో ఉన్నాడు’ అంటూ పలికే డైలాగ్ ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సెప్టెంబర్ 10 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తుంది అనడంలో కూడా సందేహం లేదు. మీరు కూడా ఓ లుక్కేయండి :


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus