గతేడాది ఆఖరులో నెట్‌ఫ్లిక్స్ ఓ లిస్ట్ రిలీజ్ చేసింది మీరు చూసే ఉంటారు. అందులో ఇండియన్ సినిమా నుండి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్న సినిమాల వివరాలను అనౌన్స్ చేశారు. అయితే ఆ కంటెంట్ ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. ఇప్పుడు మరోసారి ఇంచుమించు అదే సిరీస్‌లు / సిరీస్‌ల కొత్త పోస్టర్లు షేర్ చేసింది. దీంతో ‘మళ్లీ ఎందుకు?’ అనే ప్రశ్న మొదలైంది. దానికి ఆన్సర్ ఆఖరులో చూద్దాం. ఇప్పుడైతే ఏ సినిమాలు వస్తున్నాయి చూద్దాం.
ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తక్షకుడు’. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. ‘వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్థులు..’ అంటూ ఆ పోస్టర్‌పై రాసుకొచ్చారు. దీంతోపాటు గతంలోనే అనౌన్స్ చేసిన ‘సూపర్ సుబ్బు’ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇది మీరు ఇప్పటి వరకు నేర్చుకోని కొత్త చాప్టర్ అని రాసుకొచ్చారు. ఇందులో సందీప్ కిషన్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ఈ సినికు మల్లిక్ రామ్ దర్శకుడు. రైట్ సబ్జెక్ట్ రాంగ్ టీచర్ అనే దీని ట్యాగ్‌లైన్.
ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రలో ‘మేడ్ ఇన్ కొరియా’ సిద్ధమైంది. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కొరియా వెళ్లిన ఓ సౌత్ అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే విషయాన్ని చూపించబోతున్నారు. ‘చిలవ్’ సిరీస్‌తో అర్జున్‌దాస్, ఐశ్వర్య లక్ష్మీ కూడా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో రానున్నారు. ఇక గ్యాంగ్‌స్టర్‌గా ఆర్.మాధవన్ ‘లెగసీ’తో రాబోతున్నాడు. నిమిషా సజయన్, గుల్షన్ దేవయ్య, అభిషేక్ బెనర్జీ కీలక కలసి ‘స్టీఫెన్’ అంటూ వస్తున్నారు.
పైన చెప్పిన సిరీస్‌లు / సినిమాలు చూస్తుటే సౌత్ ఇండియన్ కంటెంట్ మీద నెట్‌ఫ్లిక్స్ పెట్టుబడులు భారీగానే పెట్టింది అని అర్థమవుతోంది. సౌత్ కంటెంట్‌తో తమ ప్లాట్‌ఫామ్ మీద తక్కువ అనే అపవాదును నెట్‌ఫ్లిక్స్ తగ్గించుకునే పనిలో ఉంది. అందుకే పాత సినిమాలు / వెబ్‌సిరీస్‌లను మరోసారి అనౌన్స్ చేసి మేమున్నాం అని చెప్పకనే చెప్పింది.