సాధారణంగా ఒక సినిమా వాళ్ళు మరో సినిమాపై సెటైర్ వేస్తే ప్రమోషన్ డోస్ పెంచడానికి ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు. ఇక మీడియా ఛానెల్స్ మధ్య కూడా కొన్నిసార్లు కొట్లాటలు కామన్. అయితే ఎప్పుడు లేని విధంగా ఓటీటీ సంస్థల మధ్య ఇంటర్నెట్ వార్ నడుస్తోంది. సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ తో మీమ్స్ తో ఒకరినొకరు ఎత్తి పొడుచుకుంటున్నారు. ఆహా మొదలు పెట్టిన ఈ మాటల యుద్ధం నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతోంది.
ఇక మరోసారి ఆహాకు మహేష్ బాబు డైలాగ్ తో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్. ఏరా.. మీ ఇంట్లో అందరూ ఇలాగే తేడాగా మాట్లాడతారా..’ కౌంటర్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్.. దానితో పాటు ‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’ అనే ‘పోకిరి’ డైలాగ్ ను వాడేసింది. ఒక విధంగా నెట్ ఫ్లిక్స్ తెలుగు జనాలను ఈ కోల్డ్ వార్ తోనే ప్రమోట్ చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. ‘ఆహా’ పేరు మెన్షన్ చేయనప్పటికీ డైలాగ్స్ అన్ని కూడా వాళ్ళకే వెళుతున్నట్లు అర్ధమవుతోంది. మొదట పిట్టకథలు ఎనౌన్స్మెంట్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్ ఇక నుంచి తెలుగు ఒరిజినల్స్ త్వరలో మీ ముందుకు అంటూ వివరణ ఇవ్వగా..
మనది ఎలాగూ 100% తెలుగునే కదా.. ఇక బ్రషింగ్ లు అవసరం లేదు!’ అంటూ ఆహా సెటైరికల్ ట్వీట్ పెట్టింది. అంతే కాకుండా ‘మా దగ్గర ఎన్నో ఒరిజినల్స్ ఉన్నాయి. అరుస్తున్నామా?’ అంటూ ఓ మీమ్ ని కూడా జత చేసింది. ఆ తరువాత కూడా నెట్ ఫ్లిక్స్ రియాక్ట్ అయింది. ‘వీడు వీడి వేషాలు..’ అంటూ కామెంట్ పెడుతూ.. ‘నో ఫైటింగ్.. బాధ్యత ఉండక్కర్లా..’ అంటూ మళ్ళీ మహేష్ బాబు డైలాగ్ ను వదిలింది. మరి ఈ వార్ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.