Rajamouli: రాజమౌళికి ఇప్పుడెందుకీ ఎలివేషన్లు.. నెట్‌ఫ్లిక్స్‌ ప్లానేంటి? నెక్స్ట్‌ సినిమా కోసమా?

  • July 6, 2024 / 06:37 PM IST

ప్రముఖ దర్శకుడు, తెలుగు సినిమాను ఇంకా చెప్పాలంటే భారతీయ సినిమాను ప్రపంచ వేదిక మీద సగర్వంగా నిలబెట్టిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (Rajamouli) కోసం నెట్‌ఫ్లిక్స్‌ ఓ ట్రిబ్యూట్‌ రడీ చేసింది. ‘బాహుబలి’ (Baahubali) , ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలతో హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమాను తెరకెక్కించిన ఆయన కోసం నెట్ ఫ్లిక్స్ ప్రత్యేక డాక్యుమెంటరీని సిద్ధం చేసింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి గురించి వివరిస్తూ ‘మోడ్రన్ మాస్టర్స్- ఎస్. ఎస్.రాజమౌళి’ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ రెడీ చేసింది.

ఆగస్టు 2న ఈ డాక్యుమెంటరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తాజాగా సోషల్‌ మీడియాలో తెలిపింది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి జాతీయ, అంతర్జాతీయ సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని టాక్‌. బాలీవుడ్‌ రిపోర్టర్‌ అనుపమ చోప్రా సమర్పిస్తున్న ఈ డాక్యుమెంటరీలో హాలీవుడ్ ప్రముఖ దర్శకులు జేమ్స్ కామెరూన్, జో రూసో, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌తో (Karan Johar) పాటు.. పాన్‌ ఇండియా స్టార్లు ప్రభాస్ (Prabhas) , తారక్‌ (Jr NTR) , రామ్ చరణ్ (Ram Charan) , రానా (Rana) .. ఈ ఉంటారని టాక్‌.

భారతీయ, అంతర్జాతీయ సినిమా పరిశ్రమపై రాజమౌళి ప్రభావం ఎలా ఉందనేది ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారు అని టాక్‌. లెజెండరీ దర్శకుడు రాజమౌళి ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? దీని కోసం ఆయనకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? లాంటి అంశాలతో ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ ఉండబోతుంది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒకటే డౌట్‌. ఇప్పుడు రాజమౌళి గురించి ఈ ఎలివేషన్లు ఎందుకు? ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ అయిన వెంటనో, లేక అవార్డులు వచ్చినప్పుడో ఈ పని చేసుంటే దాని కోసం చేశారు అనొచ్చు. పోనీ కొత్త సినిమా షురూ అయిందా అంటే లేదు.

మరి ఇప్పుడు ఎందుకు జక్కన్న జిందాబాద్‌ అనేది తెలియాల్సి ఉంది. అయితే మహేష్‌బాబుతో (Mahesh Babu) రాజమౌళి తెరకెక్కించనున్న సినిమా నిర్మాణంలో నెట్‌ఫ్లిక్స్ కూడా భాగస్వామి అని అంటున్నారు. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ 190కిపైగా దేశాల్లో యాక్సెస్‌ ఉంటుంది. ఆ లెక్కన ఆయన మరింతమంది పరిచయం అవుతారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus