Shiva Jyothi: ఇంతకీ వాళ్ల రిక్వెస్ట్ ఏంటంటే..?

శివ జ్యోతి అలియాస్ సావిత్రి.. తనో స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ.. బిగ్ బాస్ లో పార్టిసిపెట్ చేసినప్పటినుండి అంతా బిగ్ బాస్ జ్యోతక్క అని పిలవడం స్టార్ట్ చేశారు. తెలంగాణ యాసలో, అందరికీ అర్థమయ్యేలా కాస్త హాస్యాన్ని జతచేసి తను చెప్పే వార్తలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా సావిత్రిగా పాపులర్ అయినా కానీ బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతిగానే కంటిన్యూ అవుతోంది..బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి రేంజ్ మరింత పెరిగింది..

న్యూస్ ప్రెజెంటర్ గానే కాకుండా సెలబ్రిటీ అయిపోయింది. స్పెషల్ ఈవెంట్స్, కామెడీ షోస్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే శివ జ్యోతి ఈ మధ్యే కొత్త బీఎండబ్ల్యూ కార్ కొంది.. ఆ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. తను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే సొంతగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందామెకి. జనరల్ గా సెలబ్రిటీస్, అందులోనూ బిగ్ బాస్ రిటర్న్ అంటే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, టీవీ అండ్ యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వూల లాంటి సందడి ఉండనే ఉంటుంది.

అలాగే తను కూడా ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ప్రొఫెషన్, పర్సనల్ లైైఫ్ కి సంబంధించిన రెగ్యులర్ అప్ డేట్స్ వంటివి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా శివ జ్యోతి షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవ్వడమే కాక నెట్టింట చర్చకు దారితీసింది.. వివరాల్లోకి వెళ్తే.. ఆమె దీపావళికి అత్తగారింటికి వెళ్తున్నానంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోలో ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోలేదు..

దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణించమంటూ రిక్వెస్ట్ చేశారు. తమ జర్నీ స్టార్ట్ అయినప్పటినుండి దాబాలో భోజనం చెయ్యడం, ఇంటి దగ్గర క్రాకర్స్ కాల్చడం లాంటివన్నీ వీడియోలో ఉన్నాయి.. హైలెట్ ఏంటంటో శివ జ్యోతి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటిది కాదు.. 2020లో దివాళీ అప్పటి వీడియో అన్నమాట..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus