Adivi Sesh, Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ ఘనత సాధించిన హీరో అడివి శేష్ మాత్రమే..!

సోషల్ మీడియాలో మూవీ లవర్స్, ఫ్యాన్స్ లేటెస్ట్ సినిమాలకు, పాత సినిమాలకు.. వాటి కథలకు, హీరోలకు, క్యారెక్టర్లకు సాలిడ్ లింక్ సింక్ చేసి.. భలే పోస్టులు చేస్తుంటారు. అవి ఎంతలా వైరల్ అవుతుంటాయో తెలిసిందే.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలెంటెడ్ యాక్టర్, రైటర్ కమ్ డైరెక్టర్ అడివి శేష్‌కి మధ్య ఇంట్రెస్టింగ్ పోలిక కలిసింది.. అదేంటో వివరంగా చూద్దాం.. 2002లో శ్రీను వైట్ల ‘సొంతం’ లో చిన్న క్యారెక్టర్ చేసిన శేష్..

అమెరికాలో జాబ్ చేస్తూ ప్యాషన్‌తో తనే నటిస్తూ, ‘కర్మ’ అనే మూవీ డైరెక్ట్ చేశాడు.. పవన్ కళ్యాణ్ ‘పంజా’, రవితేజ ‘బలుపు’ లోనూ నటించాడు.. ‘కిస్’ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు.. ‘బాహుబలి’ లో భల్లాల దేవ కొడుకుగా ఆకట్టుకున్నాడు. అక్కడినుండి రచయితగా, నటుడిగా బిజీ అయిపోయాడు.. ‘క్షణం’ కి స్టోరీ, స్క్రీన్‌ప్లే రాశాడు. థ్రిల్లింగ్ హిట్ అందుకున్నాడు. ఫీల్ గుడ్ ఫిలింస్ తెరకెక్కించే మోహన కృష్ణ ఇంద్రగంటితో ‘అమీ తుమీ’ లో హీరోగా చేశాడు.

తన స్టోరీ, స్క్రీన్‌ప్లేతో ‘గూఢచారి’, డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఎవరు?’, మహేష్ బాబు నిర్మాణంలో, ‘గూఢచారి’ దర్శకుడితో.. తను రచయితగా పని చేస్తూ తీసిన ‘మేజర్’.. రీసెంట్ సెన్సేషన్ ‘హిట్ 2’.. ఇలా.. ‘క్షణం’ నుండి ‘హిట్ 2’ వరకు వరుసగా ఆరు హిట్స్‌తో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ‘టెంపర్’ తో ట్రాక్‌లోకి వచ్చి.. ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవ కుశ’, ‘అరవింద సమేత’, ‘ఆర్ఆర్ఆర్’ వరుసగా అదిరిపోయే ఆరు హిట్లు సాధించాడు..

తారక్ తర్వాత శేష్ కూడా ఆరు అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకాభిమానులను అలరించాడు.. ఈ మధ్య కాలంలో ఇలా కంటిన్యూస్‌గా హిట్స్ కొట్టింది.. యంగ్ టైగర్ తర్వాత ఈ రేర్ ఫీట్ అందుకుంది అడివి శేష్ మాత్రమే అంటూ మూవీ లవర్స్, నెటిజన్లు తనను అభినందిస్తున్నారు. ఇప్పుడీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus