Swathi Deekshith: స్వాతీ దీక్షిత్ చేసిన పనికి పైర్ అవుతున్న నెటిజన్లు..!

స్వాతి దీక్షిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించి మెప్పించింది. ఆ తరువాత 2012లో బెంగాలీలో తోర్ నామ్ సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది. ఇక తెలుగులో దెయ్యం, జంప్ జిలాని, గమ్మత్తు లాంటి సినిమాలో కనిపించింది. బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. హౌస్ నుంచి బయటికి వచ్చాకా .. ఈ భామ ఎక్కడా కనిపించింది లేదు.

కానీ ఇప్పుడు ఓ వార్త బయటకు రావడంతో స్వాతి దీక్షిత్ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం .. బిగ్బాస్ ఫేం స్వాతి దీక్షిత్ పై ఐపీసీ 147 , 148, 427 , 504 , 506 రెడ్ విత్ 147 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది . స్వాతి తో పాటు మరో 20 మందికి పైగా కూడా ఈ కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న (Swathi Deekshith) స్వాతి దీక్షిత్ జూబ్లీహిల్స్ లో 30 కోట్ల ఇంటి కబ్జా కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అలా ప్రయత్నిస్తున్న నిందితులలో స్వాతి అప్పర్ హ్యాండ్ అంటూ పోలీసులు విచారిస్తున్నారు. అమెరికాకు చెందిన ఓ మహిళకు చెందిన ఇల్లు లీజ్ కేసు కోర్టులో నడుస్తుంది . ఆ కేసు విషయంగా స్వాతికి ఆమెకు ఏడాది పైక వివాదం జరుగుతూనే ఉంది

ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొంతమంది దుండగులుతో పాటు స్వాతి , చింతల ప్రశాంత్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి వాచ్మెన్ పై బూతులు మాట్లాడి .. ఇల్లు ఖాళీ చేయమని బెదిరించిందట .. లేకపోతే చంపేస్తాను అంటూ వార్నింగ్ చేసిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. చూడడానికి చక్కగా ఉండే నువ్వు ఇంత కన్నింగా..? ఇలాంటి పనులు నీకు అవసరమా అంటూ జలనాలు ఫైర్ అయిపోతున్నారు..!

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus