విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లియో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేదు. లియో ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులలో ఎక్కువమంది ఈ ట్రైలర్ చూసి నిరాశకు గురయ్యామని చెబుతున్నారు. విక్రమ్ తర్వాత లోకేశ్ సినిమా అంటే భారీగా అంచనాలు ఏర్పడ్డాయని అయితే ట్రైలర్ రొటీన్ గా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. విజయ్ గత సినిమాలను గుర్తు చేసే విధంగా ఈ ట్రైలర్ ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనిరుధ్ బీజీఎం కూడా ఆశించిన రేంజ్ లో లేదని నెటిజన్లు చెబుతున్నారు. సంజయ్ దత్, త్రిష, అర్జున్ లుక్స్ మాత్రం బాగున్నాయని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ కు ఏ మాత్రం సంబంధం లేకుండా ట్రైలర్ ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ ను సైతం పూర్తిస్థాయిలో సంతృప్తిపరిచే విధంగా ఈ ట్రైలర్ లేకపోవడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లియో సినిమా ట్రైలర్ నెగిటివ్ కామెంట్ల గురించి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ట్రైలర్ నిరాశకు గురి చేసినా సినిమా మాత్రం నిరాశకు గురి చేసే ఛాన్స్ అయితే లేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. విజయ్ పారితోషికం భారీ రేంజ్ లో విజయ్ ప్రతి సినిమా సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
విజయ్ కెరీర్ పరంగా భారీ విజయాలను సొంతం చేసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో విజయ్ మరిన్ని సంచలనాలను సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు. ఈ నెల 19వ తేదీన రిలీజ్ కానున్న లియో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. విజయ్ మాత్రం (LEO) లియో మూవీ రిజల్ట్ విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.