Deepika Padukone: యుఎస్ హాలిడే వెకేషన్ లో చిల్ అవుతున్న దీపికా?

బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి దీపికా పదుకొనే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారంగా కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. పెళ్లయిన తర్వాత కూడా ఈ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.ఈ విధంగా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న దీపిక కాస్త తన షూటింగులకు విరామం ఇచ్చారు.

ఈ క్రమంలోనే షూటింగుకు బ్రేక్ తీసుకున్న ఈమె యుఎస్ లో ఉన్న తన భర్త రణవీర్ సింగ్ దగ్గరకు వెళ్లి హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి దీపికా శంకర్ మహదేవన్ కాలిఫోర్నియా సంగీత కచేరీకి కూడా వెళ్లారు. ఇటీవల జరిగిన కొంకణి సమ్మేళన్‌కు కూడా హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి దీపిక సాంప్రదాయ దుస్తులను ధరించి తన భర్తతో కలిసి వెళ్లారు.

ఈ విధంగా ఈ జోడిని అక్కడ చూడటంతో తెలుగు భారత అభిమానులు.. దీపికా దీపికా అంటూ గట్టిగా అరుస్తూ చప్పట్లతో పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇకపోతే కొందరు మహిళ అభిమానులు దీపికా అంటూ గట్టిగా కేకలు వేయడమే కాకుండా వి లవ్ యూ అంటూ కేకలు వేయడంతో దీపిక స్పందిస్తూ…ఐయామ్ మ్యారీడ్ విమెన్ నవ్ అని సరదాగా బదులిచ్చారు. ఇది విన్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus