Hero Nani: నాని కెరియర్ లోని బెస్ట్ సినిమాగా దసరా?

  • July 1, 2022 / 12:12 PM IST

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఈయన నటించిన అంటే సుందరానికి సినిమా విడుదలై థియేటర్లో మిశ్రమ స్పందన లభించుకుంది. ఇకపోతే ప్రస్తుతం నాని తన తదుపరిచిత్రం దసరా సినిమాపై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సినిమాని దసరాకు విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.నాని కెరియర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా దసరా సినిమా విడుదల కానుంది.ఇకపోతే ప్రస్తుతం షూటింగ్ పనులతో బిజీగా ఉన్నా ఈ సినిమా గురించి ఒక నెటిజన్ ఆసక్తికరమైన ట్విట్ చేశారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నాని దసరా సినిమా షూటింగ్ ఆగిపోయిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై ఒక నెటిజన్ డైరెక్టర్ ను ప్రశ్నిస్తూ.

.#Dasara #Nani మూవీ షూటింగ్ ఆగిపోయింది. స్క్రిప్ట్, యాక్షన్ సీన్స్ పై రీషూట్ జరుగుతుందంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చూసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలా తనదైన శైలిలో నెటిజన్ కు సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నేటిజన్ అడిగిన ప్రశ్నకు బ్రహ్మనందం జిఫ్ ఫైల్ రిప్లై ఇస్తూ దసరా సినిమా గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు.

ఇలా ఈ సినిమా గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ సినిమా శర్వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది. దసరా సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి దసరాకి విడుదల చేయాలని ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus