Aishwarya , Abhishek: ఐశ్వర్య అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారా… అందుకే ఇలా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీ నటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ జంట ఒకటి. వీరిద్దరూ పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకొని ఇన్ని రోజులు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈ దంపతులు ఆరాధ్య బచ్చన్ అనే అమ్మాయికి జన్మనిచ్చారు. ఇక ఎక్కడికి వెళ్లినా ఈ ముగ్గురు కలిసి వెళ్లేవారు. తాజాగా ఐశ్వర్యరాయ్ అభిషేక్ విడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

తాజాగా నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్ హాజరు కాకుండా ఐశ్వర్య, ఆరాధ్య మాత్రమే హాజరయ్యారు.ఇక ఈ ఒక్క కార్యక్రమానికి మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో ఐశ్వర్య అభిషేక్ ఎక్కడ జంటగా కనిపించలేదు. ఇలా వీరిద్దరూ ఒంటరిగా కనిపించడంతో ఇద్దరు మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలు తెరపైకి వచ్చాయి.

ఈ క్రమంలోనే కొందరు వీరు విడాకులు తీసుకోబోతున్నారా అంటూ సందేహాలను కూడా తలెత్తుతున్నారు. అయితే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు గతంలో ఇలా ఎన్నోసార్లు ఐశ్వర్య అభిషేక్ విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇలా గతంలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు రావడంతో అభిషేక్ ఈ విషయంపై స్పందిస్తూ నేను విడాకులు తీసుకుంటున్నానని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అలాగే పనిలో పనిగా నాకు రెండో పెళ్లి ఎప్పుడో కూడా మీరే చెప్పండి అంటూ ఈ వార్తలకు కౌంటర్ ఇచ్చారు.

ఇక వీరి (Aishwarya) వివాహం 2007 ఏప్రిల్ నెలలో జరగగా 2011లో వీరికి ఆరాధ్య జన్మించారు. ఇలా పలుమార్లు వీరి విడాకుల గురించి వార్తలు రాగా వాటిని అభిషేక్ ఖండిస్తూ వచ్చారు. మరి తాజాగా వస్తున్నటువంటి వార్తలపై అభిషేక్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus