తాప్సిపై విరుచుకు పడుతున్న నెటిజనులు

ఢిల్లీలో పుట్టి పెరిగిన తాప్సి ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉంటోంది. విజయాల వల్ల కాదు.. వివాదాల వల్ల. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగువారికి పరిచయమైన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో అవకాశాలు రాగానే.. నటిగా పరిచయం చేసిన డైరక్టర్ కె రాఘవేంద్ర రావు పైనే విమర్శలు చేసి తెలుగువారి ఆగ్రహానికి గురయింది. ఈ విషయం తెలుసుకొని క్షమాపణలు చెప్పి మళ్లీ తెలుగులో సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె “మన్‌మార్జియాన్‌” అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్‌ లో భాగంగా అభిమానులతో ముచ్చటించబోయి.. ఇష్టమొచ్చినట్లు రిప్లై ఇస్తూ హంగామా చేస్తోంది.

ఈ చిత్రంలో పంజాబీ సంస్కృతిని కించపర్చేలా సీన్స్‌ ఉన్నాయని ఆరోపించిన ఓ నెటిజన్ పై తాప్సీ సెటైర్ గా కామెంట్ చేసింది. ఇంకేముంది .. నెటిజన్లు తాప్సీని జోరుగా విమర్శించడం మొదలెట్టారు. తాప్సీ శరీరాకృతిపైనా కూడా నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. వాటికీ కూడా రిప్లై ఇస్తూ రచ్చ చేస్తోంది. ‘పింక్‌’ సినిమాతో తాప్సి మంచి గుర్తింపు సంపాదించుకుంది. మళ్లీ అటువంటి హిట్ ని సొంతం చేసుకోవాలని ఆశపడుతోంది. అందుకని వివాదాస్పద కామెంట్స్ చేసే దారికి ఎంచుకోవడం బాగాలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus