Jr NTR: వామ్మో.. యంగ్ టైగర్ ప్లానింగ్ భలే ఉందిగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఒక సినిమాకు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కు వీరాభిమాని కావడం వల్ల ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రశాంత్ నీల్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కేజీఎఫ్ ఛాప్టర్2 సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ తమ ఫేవరెట్ హీరో అయిన తారక్ ను ఏ విధంగా చూపిస్తారో అని అభిమానులు జోరుగా చర్చించుకుంటున్నారు.

Click Here To Watch NOW

అయితే చరణ్, బన్నీ చేసిన పొరపాటు తారక్ అయితే చేయలేదని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వాస్తవానికి చరణ్, బన్నీ ప్రయత్నిస్తే కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా రిలీజ్ కాకముందే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ అయ్యి ఉండేది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ పై ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల ఎన్టీఆర్ ముందే ప్రశాంత్ నీల్ తో సినిమా ఫిక్స్ చేసుకోగా ఈ విషయంలో చరణ్, బన్నీ మాత్రం వెనుకబడ్డారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ వరుస పాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

సలార్ పూర్తైన తర్వాత తారక్ తో సినిమా చేయనున్న ప్రశాంత్ నీల్ యశ్ తో మరో సినిమాను, మురళితో ఒక సినిమాను చేయనున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తి కావడానికి కనీసం ఆరు నుంచి ఏడేళ్ల సమయం పడుతుందని చెప్పవచ్చు. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను అందుకుంటాడని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ప్రశాంత్ నీల్ రాజమౌళికి గట్టి పోటీ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి తారక్ పుట్టినరోజున ఏదైనా అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.

సలార్ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా భారీ బడ్జెట్ లతో తెరకెక్కనున్నాయి. ప్రశాంత్ నీల్ సౌత్ సినిమాల ఖ్యాతిని మరింత పెంచుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus