Bandla Ganesh: లైగర్ పై నెటిజన్ల పంచ్ లు మామూలుగా లేవుగా?

ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో భారీ అంచనాలతో విడుదలైన సినిమాలలో లైగర్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఈ సినిమా గురించి నెగిటివ్ గా ప్రచారం జరుగుతోంది. పూరీ జగన్నాథ్ నిర్లక్ష్యంగా ఈ సినిమాను తెరకెక్కించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లైగర్ సినిమాలో అసలు కథే లేదని లవ్ సీన్లు, ఎమోషనల్ సీన్లు అస్సలు ఆకట్టుకోలేదని నెటిజన్లు చెబుతున్నారు.

విజయ్ దేవరకొండ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసినా ఆయన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అని సోషల్ మీడియాలో అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ దేవరకొండ అభిమానులను ఈ సినిమా తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. అయితే బండ్ల గణేష్ ఉసురు వల్లే లైగర్ సినిమా డిజాస్టర్ అయిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. చోర్ బజార్ మూవీ ఈవెంట్ లో బండ్ల గణేష్ పూరీ జగన్నాథ్ ను టార్గెట్ చేస్తూ సొంత కొడుకును పట్టించుకోకుండా ఎవరినో సూపర్ స్టార్లు చేస్తావంటూ సెటైర్లు వేశారు.

బండ్ల గణేష్ ఉసురు, మరి కొందరి ఉసురు తగలడం వల్లే ఈ సినిమాకు ఇలాంటి టాక్ వచ్చిందని మరి కొందరు చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ ఈరోజు మాత్రం ట్విట్టర్ లో ఎలాంటి పోస్ట్ లు చేయకపోవడం గమనార్హం. లైగర్ ఫ్లాప్ వల్ల పూరీ జగన్నాథ్ కు ఆర్థికంగా కూడా ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తన సినిమాలపై భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి పూరీ జగన్నాథ్ నష్టపోతున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus