రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ వద్ద తీవ్రస్థాయిలో విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న మైనస్ లు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా వల్ల రామాయణం కాన్సెప్ట్ తో మరో డైరెక్టర్ సినిమా తీస్తానని చెప్పినా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో రామాయణం దిశగా అడుగులు పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ రామాయణంలో రణబీర్ కపూర్, అలియా భట్ రాముడు, సీత పాత్రల్లో నటిస్తుండగా నటీనటుల ఎంపికపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీఫ్ తినే (Ranbir Kapoor) రణబీర్ ను రాముని పాత్రకు ఎంచుకోవడం సరికాదని బోల్డ్ పాత్రలో నటించిన అలియా భట్ ను ఈ పాత్రకు ఎంచుకోవడం కూడా కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ నిర్మాత ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. నితీష్ తివారి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
మైథలాజికల్ ప్రాజెక్ట్స్ అంటే దర్శకనిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మైథలాజికల్ సినిమాలను తెరకెక్కించే దర్శకులు వివాదాలకు తావివ్వకుండా సినిమాలను తెరకెక్కించాల్సి ఉంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తున్నా కథ, కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదిపురుష్ సినిమా విషయంలో వ్యక్తమవుతున్న స్థాయిలో తర్వాత సినిమాల విషయంలో విమర్శలు వ్యక్తం కాకుండా మేకర్స్ జాగ్రత్త పడాల్సి ఉంది. మైథలాజికల్ సినిమాలను తెలుగు డైరెక్టర్లు మాత్రమే బాగా తెరకెక్కిస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు రామాయణం, మహాభారతం దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లు ఈ ప్రాజెక్ట్ ల దిశగా అడుగులు వేయాల్సి ఉంది.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్