ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీని ఏ క్షణాన మొదలుపెట్టారో తెలీదు కానీ ఈ సినిమా చిక్కుకున్న స్థాయిలో మరే సినిమా వివాదాల్లో చిక్కుకోలేదు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ కాగా ఆ పోస్టర్ పై కూడా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. రామాయణం గురించి కనీస అవగాహన లేకుండా ఓం రౌత్ ఈ సినిమాను తీశారా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఓం రౌత్ రిలీజ్ చేసిన పోస్టర్లతో పోల్చి చూస్తే ఎడిటింగ్ పోస్టర్లు ఎంతో బెటర్ అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలో ఇలాంటి తప్పులు ఉంటాయని మేము ఊహించలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
రాముడి తలపై కిరీటం లేకపోవడం, సాత్వికంగా రాముడిని చూపించకపోవడం, సీత పాత్రకు శాలువా కప్పడం, లక్ష్మణుని పాత్రకు వాడిన దుస్తులు లెదర్ లా ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రాఫిక్స్ లో మార్పులు చేశారని అనిపించడం లేదని నెటిజన్లు చెబుతున్నారు. సీత మెడలో తాళి, కాలికి మెట్టెలు లేవని కృతిసనన్ సీతలా కాదని చెలికత్తెలా కూడా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లక్ష్మణుడు, హనుమంతుని పాత్రల లుక్స్ విషయంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ (Adipurush) ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని ఈ సినిమా తీశారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత మరిన్ని వివాదాల్లో చిక్కుకోవడం ఖాయమని కొంతమంది చెబుతున్నారు. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జూన్ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ తగ్గుతున్నాయి.