Chandrahaas: ప్రభాకర్ కొడుకును మళ్లీ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణాలివే!

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నటుడిగా, నిర్మాతగా ప్రేక్షకుల మెప్పు పొందిన ప్రభాకర్ ప్రస్తుతం వరుసగా సీరియల్ ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. పరిమిత సంఖ్యలో సినిమాలకు ఓకే చెబుతున్న ప్రభాకర్ ఆ పాత్రల ద్వారా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రోల్స్ గురించి ప్రభాకర్ స్పందిస్తూ ఒక విధంగా ట్రోల్స్ వల్ల కూడా మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు.

తన కొడుకుపై ట్రోల్స్ రావడం వల్ల అతను ఒక విధంగా పాపులర్ అయ్యాడని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా చంద్రహాస్ చేసిన పని నెటిజన్లకు చిరాకు తెప్పించింది. అయ్యప్పస్వామి మాల వేసుకున్న చంద్రహాస్ ఇష్టానుసారం ఫోజులు ఇస్తూ దిగిన ఫోటోలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రహాస్ తన బిహేవియర్ ను మార్చుకోవాలని ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో చంద్రహాస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

యాటిట్యూడ్ ను మార్చుకోకపోతే చంద్రహాస్ కెరీర్ కు కూడా కష్టమని మరి కొందరు చెబుతుండటం గమనార్హం. తాజాగా కొత్త కారును కొనుగోలు చేసిన చంద్రహాస్ కొత్త కారుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి విమర్శల పాలయ్యారు. సోషల్ మీడియాలో నెగిటివిటీ వల్ల చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమాలకు సైతం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చంద్రహాస్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. కొన్ని విషయాలలో మారితే చంద్రహాస్ కెరీర్ బాగుంటుందని చెప్పవచ్చు. చంద్రహాస్ తో పరిమిత బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. చంద్రహాస్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus