రెడిన్ కింగ్స్లీ.. ఇతను చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అలా అని ఇతను తెలుగు నటుడు కాదు. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించాడు. తమిళంలో బిజీ యాక్టర్ గా రాణిస్తున్నాడు. ‘డాక్టర్’ సినిమాలో భగత్ అనే పోలీస్ గా కనిపించాడు. ఈ సినిమాలో అతని పాత్ర తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీనికి ముందు ‘కో కో కోకిల’ అనే సినిమాలో కూడా ఇతను నటించాడు. సీరియస్ గా అలాగే ఫాస్ట్ గా డైలాగులు చెబుతూనే కామెడీ పండించడం ఇతని స్టైల్.
అలా కడుపుబ్బా ప్రేక్షకుల్ని నవ్విస్తూ ఉంటాడు. ‘పెద్దన్న’ ‘బీస్ట్’ ‘జైలర్’ వంటి సినిమాల్లో కూడా ఇతను నటించాడు. ఇతని బ్యాక్ గ్రౌండ్ చాలా మందికి తెలిసుండకపోవచ్చు. మొదట్లో ఇతను గ్రూప్ డాన్సర్ గా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. అంతకు ముందు ఈవెంట్ మేనేజర్ గా కూడా పని చేసేవాడు. ఇటీవల ఇతను పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అయ్యాడు.
బుల్లితెర నటి సంగీత వి అనే అమ్మాయిని ఇతను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆనంద రాగం, తిరుమగళ్ వంటి సీరియల్స్ తో ఈమె బాగా పాపులర్ అయ్యింది. విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో కూడా ఈమె నటించి మెప్పించింది. ఇక రెడిన్ కింగ్స్లీ – సంగీత..లది ప్రేమ వివాహం అని తెలుస్తుంది. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి డిసెంబర్ 11న జరిగినట్లు స్పష్టమవుతుంది.
వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే (Redin Kingsley) రెడిన్ కింగ్స్లీ… సంగీత కంటే కొంచెం హైట్ తక్కువ. దీంతో ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్లు ‘ఆమె హైట్ ఏంటి.. నీ హైట్ ఏంటి?’ అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.