Roja: మంత్రి రోజాను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. హామీ ఎప్పుడు నెరవేరుస్తారంటూ?

ప్రముఖ నటి, వైసీపీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రోజా ప్రస్తుతం వైసీపీలో టూరిజం శాఖా మంత్రిగా ఉన్నారు. ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించి ఏడాది అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని నెలల క్రితం రోజా కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొని కొన్ని హామీలు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలో కృష్ణంరాజు పేరిట స్మృతివనం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని స్మృతివనాన్ని టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేస్తానని రోజా చెప్పుకొచ్చారు. అయితే హామీ ఇచ్చి దాదాపుగా ఏడాది అవుతున్నా ఈ హామీ నెరవేరలేదు. రోజా మాటలు హుష్‌ కాకేనా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కృష్ణంరాజు స్మృతివనం ఎక్కడంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజా ఈ కామెంట్ల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి రోజా ఘాటు వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం. రోజా బాలకృష్ణపై, పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటంతో నెటిజన్లు సైతం రోజాపై ట్రోల్స్ చేస్తున్నారు. రోజా వచ్చే ఎన్నికల్లో కూడా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అయితే రోజాకు వైసీపీ ముఖ్య నేతల సపోర్ట్ లేదు.

రోజాకు (Roja) 2024 ఎన్నికల్లో గెలుపు సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోజా ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలకు దూరంగా ఉండటంతో ఆమె ఆదాయం కొంతమేర తగ్గింది. రాబోయే రోజుల్లో రోజా టీవీ షోలలోకి రీఎంట్రీ ఇస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. 2024 ఎన్నికల్లో రోజా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus