Rashmika Mandanna: బన్నీను గుర్తుపట్టలేకపోయిన రష్మిక.. ఓవర్ అంటున్న నెటిజన్స్?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎలాంటి అంచనాలు లేకుండా ఏకంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకొని ప్రస్తుతం ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే రష్మికకు వరుస అవకాశాలు రావడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఇకపోతే రష్మిక కెరియర్ పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే కొన్నిసార్లు ఈమె చేస్తే పోస్టులు నెటిజన్లకు కాస్త ఓవర్ గా అనిపిస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే తాజాగా ఈమె చేసిన పోస్ట్ పై నేటిజెన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఒక యాడ్ లో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ యాడ్ కోసం అల్లు అర్జున్ ట్రెండీ లుక్ లో కనిపించారు.

చెవికి పోగులు పెట్టుకొని కొత్త హెయిర్ స్టైల్, నోట్లో సిగార్ పెట్టుకొని అల్లు అర్జున్ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి. ఇక ఈ ఫోటోని అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అయింది. ఇది చూసిన రష్మిక ఒక క్షణం పాటు గుర్తుపట్టలేకపోయాను సార్ అంటూ ఈ పోస్ట్ పై స్పందించారు.ఈ క్రమంలోనే నెటిజెన్లు పెద్ద ఎత్తున రష్మికపై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

నీకు టాలీవుడ్ హీరోలు ఎందుకు గుర్తుంటారు. బాలీవుడ్ ముఖాలు మాత్రమే గుర్తుంటాయి అంటూ దారుణంగా రష్మికపై ట్రోల్స్ చేస్తున్నారు. తన పక్కన నటించిన హీరోనే గుర్తుపట్టలేకపోవడం దారుణం ఇది కాస్త ఓవర్ గా ఉంది రష్మిక అంటూ నేటిజెన్లు ఈమెపై మండిపడుతున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus