Ananya Nagalla: తెలుగమ్మాయి లుక్ మార్చేసిందిగా!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ అందాన్ని మరింత పెంచుకోవడానికి సర్జరీలు చేయించుకుంటారు. హీరోలు కూడా కొందరు ఈ పద్దతిని ఫాలో అయ్యారు. ముక్కు, పెదవులకు చిన్న చిన్న కరెక్షన్స్ చేయించుకుంటూ ఉంటారు. ఆ విధంగా మరింత అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకప్పటి నటి శ్రీదేవి నుంచి ఈ జెనరేషన్ హీరోయిన్ల వరకు అందరూ ఈ బాట పట్టినవారే. అయితే ఇలాంటి సర్జరీలు అందరికీ సెట్ కావు. వీటి వల్ల కొందరు ఉన్న అందం పాడుచేసుకున్నారు.

అయేషా టాకియా, తారా సుతారియా లాంటి హీరోయిన్లకు లిప్ సర్జరీలు తేడా కొట్టేసి కాస్త.. వేరేగా కనిపించడం తెలిసిందే. ఇప్పుడు ఓ తెలుగు హీరోయిన్ ఇలానే సర్జరీ ద్వారా తన అందాన్ని తగ్గించుకున్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు.. అనన్య నాగళ్ల. ‘మల్లేశం’, ‘ప్లే బ్యాక్’, ‘వకీల్ సాబ్’ లాంటి సినిమాలతో పాపులర్ అయింది అనన్య. అయితే ఈ మధ్య పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉండే అనన్య..

తాజాగా కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందులో ఆమె చాలా హాట్ గా కనిపిస్తోంది. కానీ తన లుక్ మాత్రం కాస్త తేడాగా కనిపిస్తోంది. ముక్కుకి, పెదవులకు ఆమె సర్జరీలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. క్లోజప్ లుక్ లో చూస్తే ఆ విషయం క్లియర్ గా కనిపిస్తోంది. కొంతమంది అనన్యయేనా అనే డౌట్ కూడా వస్తోంది. ప్రస్తుతం ఉన్న లుక్ తో పోలిస్తే.. పాత లుక్ లోనే ఆమె బాగున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ముఖ్యంగా పెదవుల దగ్గర కొంచెం తేడా కొట్టేసిందనిపిస్తుంది. దీంతో నెటిజన్లు.. ఉన్న అందాన్ని మెయింటైన్ చేసుకోకుండా.. ఎందుకీ పాయసం అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై అనన్య స్పందిస్తుందేమో చూడాలి!


అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus