అభిమానుల మీద ఎంతో ప్రేమతో తన కొత్త సినిమాల అప్‌డేట్స్ చెప్పారు ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) . ఈ క్రమంలో ఓ సినిమాకు సంబంధించి అభిమానుల్లో లేనిపోని గుబులు రేపారు. ఇప్పటికే పుకార్లు గుప్పుమంటున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలిసొచ్చి ఆ సినిమా మీద వస్తున్న పుకార్లకు ఊతం ఇచ్చినట్లు అయ్యింది. ఆ సినిమా ఏంటో మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. ప్రభాస్ (Prabhas) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) గురించే ఇదంతా.
తన కొత్త సినిమాల గురించి కమల్ చెబుతూ ‘కల్కి 2898 ఏడీ’లో అతిథి పాత్రలో నటించానని, ఆ షూటింగ్ పూర్తయిపోయిందని కమల్ తెలిపారు. దీంతో ‘అదేంటి ఆ సినిమాలో విలన్ కదా… ఇప్పుడు అతిథి పాత్ర అంటున్నారేంటి?’ అనే డౌట్ మొదలైంది అభిమానుల్లో. విలన్‌గా కమల్ అంటే వచ్చిన ఊపు, బజ్… ఇప్పుడు ఒక్కసారిగా డ్రాప్ అవ్వడం కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలో కొంతమంది మాత్రం ఆయన సగమే చెప్పారని… అసలు విషయం వేరే ఉందని అంటున్నారు.
కమల్ హాసన్‌ను ‘కల్కి’ సినిమాలోకి తీసుకొని ఓ వారం షూటింగ్ చేశారు. అందులోనూ ఆ పాత్ర సినిమాకు చాలా కీలకం అని అంటున్నారు. కానీ వారంలోనే సీన్స్ చేసేయడం ఏంటి అనే డౌట్ అప్పుడే వచ్చింది. సినిమా రెండు పార్టులుగా వస్తుందని, తొలి పార్టు ఆఖరులో కమల్ వస్తారని అప్పుడు అన్నారు. అయితే ఇప్పుడు కమల్ అతిథి పాత్ర అనేసరికి… తొలి పార్టులో అతిథి పాత్రగా వచ్చి… రెండో పార్టులో మెయిన్ విలన్ అవుతారు అని ఓ అంచనా వినిపిస్తోంది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కల్కి’. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను మే 9న విడుదల చేస్తున్నట్లు ఇటీవల టీమ్ ఘనంగా అనౌన్స్ చేసింది. అయితే సినిమా తొలి పార్టును రిలీజ్ చేస్తున్నారా? లేక మొత్తం సినిమానా అనేది చెప్పలేదు. ఇప్పుడు కమల్ మాటలు చూస్తుంటే రెండు పార్టులు ఉన్నాయి అనే అనిపిస్తోంది.
సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!
కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్