‘ఆర్ఆర్‌ఆర్’ నిర్మాతలకు తమ సినిమా అవుట్‌పుట్ మీద నమ్మకమో, లేక గుండె ధైర్యం ఎక్కువో కానీ… సినిమా ఇన్నిసార్లు వాయిదా పడినా చాలా గుంభనంగా ఉంటున్నారు. వారికి అదెలా సాధ్యమైందో తెలియదు కానీ… వాళ్లకు మరో తలనొప్పి అయితే మొదలైందని మాత్రం తెలుస్తోంది. ఈసారి కరోనా నుండి కాదు, ఏపీ ప్రభుత్వం నుండి కాదు. వాళ్ల సినిమాను కొన్న బయ్యర్ల నుండి అని తెలుస్తోంది. అవును ఈ బాధ మేం భరించలేం. మా డబ్బులు వెనక్కి ఇచ్చేయండి అని అంటున్నారని టాక్.
ఈసారి ఏది ఏం జరిగినా రిలీజ్ పక్కా అని అనుకుంటుండగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మరోసారి వాయిదా అంటూ ప్రకటన ఇచ్చి అందరినీ షాక్‌కి గురి చేసింది. ఒకవేళ వాయిదా వేయకపోతే థియేటర్లలో జనాలు రాక, టికెట్ ధరల తక్కువ ఉండి డబ్బులు రాక మొత్తం టీమ్ ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఇది ఓ యాంగిల్. ఈ వ్యవహారంలో మరో యాంగిల్ కూడా ఉంది. అదే పంపిణీదారుల కష్టాలు. అవును సినిమా విడుదల వాయిదా వేయడంతో తమకు చాలా ఇబ్బంది అని వాళ్లు వాపోతున్నారని టాక్.
సినిమాను మరోసారి వాయిదా వేయడంతో పంపిణీదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నిర్మాత డీవీవీ దానయ్యపై వాళ్లు తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నట్టు ఫిల్మ్‌నగర్ ముచ్చట. సినిమాకు వచ్చిన హైప్, ఇన్‌బిల్ట్ క్రేజ్‌తో సినిమా ఎప్పుడొచ్చినా వసూళ్ల సునామీ పక్కా అని పంపిణీదారులు తొలుత అనుకున్నారు. అందుకే రెండేళ్లుగా వరుసగా వాయిదా పడుతున్నా ఓకే అనుకున్నారు. అయితే ఇప్పుడు కూడా వాయిదా అనేసరికి వడ్డీల భారం ఎక్కువైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ అన్ని ఏరియాల హక్కుల కోసం చాలా రోజుల క్రితమే వాళ్లంతా డబ్బులిచ్చేశారు. ఇప్పుడు ‘‘మాకు మీ సినిమా వద్దు.. మా డబ్బులు వడ్డీతో సహా మాకు తిరిగి ఇచ్చేయండి’’ అని కొంతమంది పంపిణీదారులు దానయ్యపై ఒత్తిడి తీసుకొస్తున్నారని సమాచారం. సినిమా మీద నమ్మకంతో వడ్డీలకు డబ్బులు తెచ్చి మరీ కొన్నామని, ఇప్పుడు వాటితో ఇబ్బందిగా ఉందని అడుగుతున్నారట. అయితే నిర్మాత దగ్గర ఈ పరిస్థితి ఉండదు. కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సమయంలో డబ్బులు వెనక్కివ్వమంటే ఏ నిర్మాతా ఇవ్వలేరు. మరి దానయ్య ఏం చేస్తారో చూడాలి.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!