Drushyam2: సురేశ్‌బాబు బిజినెస్‌ టాక్టిక్స్‌ దెబ్బ కొట్టాయా..!

వెంకటేశ్‌ సినిమాలు – ఓటీటీ… ఈ రెండు అంశాలకు సరిగ్గా కుదరడం లేదా? పరిస్థితులు, స్పందనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మొన్నా మధ్య ‘నారప్ప’ సినిమా ఓటీటీలో విడుదల చేద్దాం అనుకుంటే… పంపిణీదారులు, థియేటర్ల వారి నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది. ఆ తర్వాత ఎలాగోలా అన్నీ దాటుకొని ఆ సినిమా ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు ‘దృశ్యం 2’కి అడ్డంకులు వస్తున్నాయి అంటున్నారు. అయితే ఈసారి ఓటీటీ నుండి.

వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం 2’ ఈ నెల 25న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమనాఉ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌కు ఇచ్చారని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ ఫైనల్‌గా ప్రైమ్‌కి వెళ్లింది. దీంతో సినీ అభిమానుల్లో ఈ మార్పేంటి అనుకున్నారు. ఇప్పుడు ఇదే అంశం సినిమాకు కొత్త కష్టాలు పెడుతోంది అంటున్నారు. అవును ఈ సినిమా రిలీజ్‌ విషయంలో డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ న్యాయ సలహా తీసుకుంటోందని టాక్‌.

‘దృశ్యం 2’ను ఓటీటీలో విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్పుడు డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్ నుండి డీల్‌ మొదలైంది. ఈ ప్రాసెస్‌ అగ్రిమెంట్ల వరకు వెళ్లిందని టాక్‌. అయితే అమెజాన్‌ ప్రైమ్‌ నుండి ఇంకా మంచి డీల్‌ రావడంతో సురేశ్‌బాబు ఇటువైపు వచ్చేశారట. అన్నీ ఓకే చేసుకొని సినిమాను విడుదలకు సిద్ధమవుతున్నారు. అయితే తమకు మాట కూడా చెప్పకుండా డీల్‌ మార్చుకున్నారని డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ టీమ్‌ గుర్రుగా ఉందట.

దీంతో సినిమా సజావుగా విడుదల అవుతుందా? అనే అనుమానం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా డీల్‌ పర్‌ఫెక్ట్‌గా జరగలేదని హాట్‌స్టార్‌ టీమ్‌ కోర్టు మెట్లు ఎక్కుతుందని అంటున్నారు. అయితే దీనిపై రెండు వర్గాల నుండి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఇది పుకారుగా మాత్రమే మిగిలిపోతుందా? నిజమవుతుందా? అనేది చూడాలి. అయినా సురేశ్‌బాబు ఇలాంటి లెక్కలన్నీ వేసుకొని బిజినెస్‌ చేస్తారు. చూద్దాం ఏమవుతుందో?

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus