Balayya Babu: బాలయ్య మూవీ కోసం సోనాక్షి అన్ని రూ.కోట్లు అడిగిందా?

ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమాలకు హీరోయిన్ల సమస్య ఎదురవుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు బాలయ్యకు జోడీగా నటించడానికి ఆసక్తితోనే ఉన్నా బాలయ్య సీనియర్ హీరో కావడంతో బాలయ్యకు జోడీగా నటించిన తర్వాత యంగ్ జనరేషన్ హీరోలకు జోడీగా నటించే ఆఫర్లు రావడం లేదు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో సినిమాకు కూడా ఇదే సమస్య ఎదురైందని సమాచారం అందుతోంది. అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను సంప్రదించగా

ఆమె ఏకంగా ఆరు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని సమాచారం. బాలయ్య అనిల్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నప్పటికీ ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాకపోవడంతో ఆరు కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యకు జోడీగా నటించిన హీరోయిన్లను ఎంపిక చేయడం అనిల్ రావిపూడికి ఇష్టం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రియమణి, తమన్నా, కాజల్ మరి కొందరు హీరోయిన్లు బాలయ్యకు జోడీగా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ బాలయ్యకు జోడీ కావడంతో పాటు శ్రీలీలకు తల్లి పాత్రలో కనిపించాల్సి ఉంది. ఈ కారణం వల్ల కూడా కొంతమంది హీరోయిన్లు ఈ సినిమాను రిజెక్ట్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుండగా హీరోయిన్ లేని సన్నివేశాలను మొదట షూట్ చేయనున్నారని సమాచారం అందుతోంది.

15 కోట్ల రూపాయల రేంజ్ లో బాలయ్య రెమ్యునరేషన్ అందుకుంటున్న తొలి మూవీ ఇదే కావడం గమనార్హం. అఖండ మూవీ సక్సెస్ తో బాలయ్య మార్కెట్ పెరగగా మార్కెట్ కు అనుగుణంగా బాలయ్య తన పారితోషికాన్ని పెంచుతున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus