ఆ ఒక్క సమస్య తీరిపోతే అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ గ్యారంటీ..!
- May 7, 2019 / 03:47 PM ISTByFilmy Focus
మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది.. మహేష్ బాబు 25 వ చిత్రం ‘మహర్షి’. ఇప్పటికే ‘మహర్షి’ విడుదల సందడి కూడా మొదలైపోయింది. మహేష్ బాబు ల్యాండ్ మార్క్ చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటూ తమిళ్ లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కూడా పెద్ద సినిమాలు, కొత్త సినిమాలు ఏమీ లేకపోవడం.. అందులోనూ మహేష్ కి కూడా అక్కడ మార్కెట్ ఉండడంతో దీన్ని క్యాష్ చేసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
అయితే అక్కడ కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయని తాజా సమాచారం. చైన్ గా ఫేమస్ అయిన వెట్రి సినిమా యాజమాన్యం ‘మహర్షి’ చిత్రాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా లేదట. ఈ చిత్రం బయ్యర్ కు తమకు మధ్య షేరింగ్ పెర్సెన్టేజ్ విషయంలో సముఖత లేకపోవడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. ‘జికే సినిమాస్’ కూడా ఇలానే ఆలోచిస్తుందట. ప్రస్తుతం ఈ ఇష్యూ పై డిస్కషన్లు జరుగుతున్నాయట. రేపటికంతా సెట్ అయ్యిపోతే ‘మహర్షి’ కి అక్కడ కూడా ఓపెనింగ్స్ మంచిగా వచ్చే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.















