Dhanush, Sekhar Kammula: ఆ విషయంలో లేట్ చేస్తున్న శేఖర్ కమ్ముల!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందంటూ ప్రకటన వెలువడింది. అయితే ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేయలేదని సమాచారం. శేఖర్ కమ్ముల సినిమాసినిమాకు గ్యాప్ బాగానే తీసుకుంటారనే సంగతి తెలిసిందే.

శేఖర్ కమ్ముల పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ధనుష్ హీరోగా తెరకెక్కే సినిమాకు ఇప్పుడే పనులను మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ధనుష్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉండగా ఆ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ విషయంలో ఆలస్యం చేస్తే ఆయన స్థానాన్ని వెంకీ అట్లూరి భర్తీ చేస్తారని తెలుస్తోంది. వెంకీ అట్లూరి కథతో సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ధనుష్ ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.

శేఖర్ కమ్ముల ధనుష్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి ఎన్ని నెలలు పడుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాతో హ్యాట్రిక్ సొంతం చేసుకుంటారేమో చూడాలి.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus