కబాలి కొత్త సమస్యలు!

క‌బాలి.. క‌బాలి…క‌బాలి.. ఏ చోట విన్నా ఈ మాటే!  మ‌రి కొద్ది గంట‌ల్లో ర‌జ‌నీకాంత్ ప్ర‌భంజ‌నం వెండి తెర‌పై చూడ‌బోతున్నారంతా. ఈ సినిమా ప‌బ్లిసిటీ పీక్స్ కి చేరింది. దాని కోసం చిత్ర‌బృందం ప్ర‌త్యేకంగా చేసిందేం లేదు. అభిమానులే ఈ సినిమాకి కావ‌ల్సినంత హైప్ తీసుకొచ్చారు. క‌బాలి ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుందా??  అంటూ అంతా లెక్క‌లు వేసుకొంటున్నారు.

క‌బాలిగా ర‌జ‌నీ లుక్ ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చిందో అప్ప‌టి నుంచీ క‌బాలిపై పాజిటీవ్ బ‌జ్ వినిపిస్తోంది. ఈ సినిమాని బాషాతో పోల్చి చూస్తున్నారంతా. అప్ప‌ట్లో బాషా ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో ఇప్పుడు క‌బాలి కూడా అంత‌లా రికార్డుల హోరెత్తిస్తుంద‌ని పందేలు కాస్తున్నారు. అయితే తొలిసారి క‌బాలి గురించి నెగిటీవ్ బ‌జ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సినిమా అనుకొన్నంత‌గా ఏం లేద‌ని, పైగా క్లైమాక్స్ ఎవ్వ‌రికీ న‌చ్చ‌ద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల టాక్‌. సెన్సార్ అయ్యాక ఇన్ని రోజుల‌కు ఈ టాక్ బ‌య‌ట‌కు రావ‌డం కాస్త ఆశ్చ‌ర్యాన్నిక‌లిగిస్తోంది. క‌బాలి ఆన్‌లైన్‌లో లీకైంద‌న్న వార్త‌లు గుప్పుమ‌న్న నేప‌థ్యంలో ఇలాంటి నెగిటీవ్ టాక్ రావ‌డం కాస్త కల‌వ‌ర‌పెట్టేదే. ఈ సినిమా అటూ ఇటూ అయితే.. లింగ ప‌రిస్థితే మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus