టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్ల క్రితం వరకు మిడిల్ రేంజ్ హీరోల, చిన్న హీరోల హవా కొనసాగింది. అయితే ప్రస్తుతం ఓటీటీల హవా పెరగడంతో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు గతంలోలా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని, శర్వానంద్, రామ్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, నాగచైతన్య, అఖిల్ మరి కొందరు హీరోలు ఈ జాబితాలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తున్నా కలెక్షన్లు మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెరుగుతుండటం కూడా మిడిల్ రేంజ్ హీరోల సినిమాలపై ప్రభావం చూపుతోంది. యూత్ లో ఈ హీరోలకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ హీరోల సినిమాలకు కలెక్షన్లు రావడం లేదు. ఈ హీరోలు ఒక్కో సినిమాకు 5 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ హీరోల రెమ్యునరేషన్ కు తగిన స్థాయిలో కూడా సినిమాలు కలెక్షన్లను రాబట్టడంలో ఫెయిల్ అవుతున్నాయి.
రాబోయే రోజుల్లో ఈ హీరోల సినిమాల పరిస్థితి ఏంటో చూడాల్సి ఉంది. చిన్న హీరోల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. అయితే ప్రేక్షకులను మెప్పించే కథాంశాలలో నటిస్తే మాత్రం ఈ హీరోలకు విజయాలు దక్కే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ హీరోలు ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ హీరోలకు రోజురోజుకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.
అయితే ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్నా చాలామంది హీరోలు రొటీన్ కథలను ఎంచుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాలపై ఆసక్తి చూపడం లేదు. డైరెక్టర్లు సైతం హీరోల మార్కెట్ ను పెంచేలా కథలను సిద్ధం చేయాల్సి ఉంది. నిర్మాతలు టికెట్ రేట్లను భారీగా తగ్గిస్తే మాత్రమే ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని కొందరు భావిస్తున్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!