‘సైరా’ టీంకు కొత్త టెన్షన్.. అచ్చం ‘సాహో’ లానే..!

ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతుంది అంటే… అందులో ‘వి.ఎఫ్.ఎక్స్’ పనులు గట్టిగానే ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే ఈ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి… ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఏళ్ళ తరబడి చేసిన కష్టమంతా వృధా అయిపోతుంది. ఈ విషయాల్లో ‘అఖిల్’ ‘స్పైడర్’ వంటి చిత్రాలని పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాలన్నీ ఈ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదో అభిమానులు తొందరపెడుతున్నారని లైట్ తీసుకోకూడదు. అందుకే ప్రభాస్ ‘సాహో’ కూడా ‘వి.ఎఫ్.ఎక్స్’ సరిగ్గా పూర్తి కాలేదని పోస్ట్ పోన్ చేసారు. మొదట ఆగష్టు 15న విడుదల తేదీ ప్రకటించి.. ఆ తరువాత 30 కి మార్చారు. ఇప్పుడు ‘సై రా’కి కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతుందా…? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం దాదాపు 26 స్టూడియోలలో ‘సై రా’ వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో ఒక్క స్టూడియో టైం కి అవుట్ పుట్ ఇవ్వకపోయినా రిలీజ్ డేట్ విషయంలో సమస్యలు ఏర్పడతాయని తెలుస్తుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ‘సైరా’ ని విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. కానీ ఈలోపు వీఎఫ్ఎక్స్ పనులు పూర్తవుతాయా..? లేదా..? అనే టెన్షన్.. ‘సై రా’ టీమ్ కి చాలానే ఉందని ఇన్సైడ్ టాక్. దీంతో వీఎఫ్ఎక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రతీ స్టూడియోకి వెళ్ళి పని ఎంతవరకూ అయ్యింది అనే ఆరాలు తరచూ తీస్తున్నారట. ఇందుకోసం ఓ స్పెషల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేశారట. అయితే వీఎఫ్ఎక్స్ ఎంత త్వరగా పూర్తయినా దాన్ని ఫైనలైజ్ చేయడానికి కూడా సమయం పడుతుంది. ఎందుకంటే వాటిలో చాలా మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ‘సైరా’ అక్టోబర్ 2 కి కచ్చితంగా వస్తుంది అని చెప్పలేము అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus