Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో మూడు నెలల ఎదురుచూపులు.. రిలీజ్ ఎప్పుడంటే?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఏపీ ఎన్నికల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ మారడం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం జులై రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కోసం మరో మూడు నెలలు ఎదురుచూపులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కల్కి 2898 ఏడీ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది. ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు సైతం అవసరం అనే సంగతి తెలిసిందే. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి జూన్ 2వ వారం వరకు టైమ్ పడుతుంది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభాస్ సినిమా కాబట్టి టికెట్ రేట్ల పెంపు విషయంలో సమస్య ఉండదు.

అయితే మూడు నెలల పాటు సినిమా వాయిదా పడితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో గుంటూరు కారం (Guntur Kaaram) మినహా మరే పెద్ద సినిమా విడుదల లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు శ్రీరామనవమి పండుగ రోజున కల్కి కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ రానుండగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ కూడా వస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

కల్కి 2898 ఏడీ ట్రైలర్ ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ ఇతర భాషల్లో సైతం భారీ కలెక్షన్లతో మ్యాజిక్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్కి 2898 ఏడీ సలార్ ను మించిన హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus