RRR OTT: ఓటీటీలో ముందుకు జరిగిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

కారణాలు ఏమైనా కావొచ్చు.. ‘ఆర్‌ఆర్ఆర్‌’ థియేట్రికల్‌ రిలీజ్‌కి ఆరు డేట్స్‌ అనౌన్స్‌ చేశారు. ఆఖరికి ఐదో డేట్‌కి సినిమా రిలీజ్‌ చేశారు. అంటే సినిమా వాయిదా పడుతూ పడుతూ ఆఖరికి మార్చి 25న విడుదలైంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా జరుగుతోంది. ఈ సినిమాను తొలుత అనుకున్నదాని కంటే కాస్త ముందుగానే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తారని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు కూడా కారణాలేమీ చెప్పడం లేదు.

Click Here To Watch NOW

‘ఆర్‌ఆర్ఆర్’ థియేట్రికల్‌ రిలీజ్‌కి 90 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుందని అనధికారిక సమాచారం గతంలో వచ్చింది. ఆ లెక్కన జూన్‌ ఆఖరులో సినిమా ఓటీటీకి రావొచ్చని లెక్కలేసుకున్నారు అభిమానులు. కానీ అంతకంటే ఒక నెల ముందే అభిమానుకు ఓటీటీలో సినిమా అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారట. దీంతో మే 25 నాటికి సినిమా ఓటీటీ వెర్షన్‌ రిలీజ్‌ చేస్తారని సమాచారం. ఎప్పటిలాగే దీనిపై కూడా అఫీషియల్‌ ఇన్ఫో లేదు. కానీ ఈ డేట్‌ అయితే పక్కా అని మాత్రం సమాచారం.

‘ఆర్ఆర్ఆర్‌’ రెండు ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది. జీ5, నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని కైవసం చేసుకున్నాయని టాక్‌. దీంతో ప్రేక్షకులు రెండు చోట్లా ఈ సినిమా చూడొచ్చన్నమాట. సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌కి ఎంత సందడి చేశారో, ఓటీటీ రిలీజ్‌కి కూడా అంతే స్థాయిలో హంగామా చేయాలని చూస్తున్నారట. ఎందుకంటే ఓటీటీ హక్కుల కోసం రెండు సంస్థలు భారీగా ఖర్చు పెట్టాయట. దీంతో ఇక్కడ కూడా భారీ ప్రచారం చేసి మంచి వసూళ్లు సాధించాలని చూస్తున్నారట.

‘భీమ్లా నాయక్‌’ను ‘ఆహా’, ‘డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్’లో ఒకేసారి తీసుకొచ్చేసరికి… ఏ స్థాయిలో ప్రచారం జరుగుతోందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ‘ఆర్ఆర్‌ఆర్‌’ లాంటి పెద్ద సినిమాను రెండు ఓటీటీలు ఎలా ప్రచారం చేస్తాయో చూడాలి. మళ్లీ పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో చాలా విషయాలు చెప్పేశారు. ఇప్పుడు ఏం చెబుతారు అనేది చూడాలి. ఈ క్రమంలో సినిమాలోని డౌట్స్‌ ఏమన్నా క్లియర్‌ చేస్తారేమో చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus