Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

విజయ్ దేవరకొండకి ‘కింగ్డమ్’ రూపంలో కొంత రిలీఫ్ దొరికింది. జూలై 31న రిలీజ్ అయిన ఈ సినిమా తొలిరోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ కి సరైన హిట్ పడలేదు. ‘కింగ్డమ్’ తో కమర్షియల్ సక్సెస్ దొరికే అవకాశం కనిపిస్తుంది.

Kingdom

ఇదిలా ఉంటే.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో  ‘హృదయం లోపల’ అనే రొమాంటిక్ సాంగ్ ఉంటుందని ముందుగా ప్రకటించారు. ఫస్ట్ సింగిల్ పేరుతో ముందుగా ఈ పాటనే వదిలారు. అయితే సినిమాలో ఈ పాట లేదు. దీంతో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ హర్ట్ అయ్యారు. ఇందులో యూత్ ఎక్కువగా ఉన్నారు.ఈ పాట కనుక ఉంటే సీరియస్‌గా సాగుతున్న సెకండాఫ్ కి కొంత రిలీఫ్ ఇచ్చి ఉండేది అని అంతా భావించారు. కానీ పాట సినిమాలో లేదు. ఈ విషయంపై నిర్మాత నాగవంశీ కూడా స్పందించారు. ‘సెకండాఫ్ లో ఈ పాట పెట్టడానికి స్పేస్ లేదని.. విజయ్ దేవరకొండ కిస్ అంతా మిస్ అయినట్టు ఉన్నారు’ అంటూ చమత్కరించారు.

అయితే ఆగస్టు 4 నుండి అంటే సోమవారం నుండి ‘హృదయం లోపల’ పాటను థియేటర్లలోకి జత చేయనున్నారు అని తెలుస్తుంది. మరి ఏ సీన్ వద్ద యాడ్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ పాట వల్ల రిపీటెడ్ ఆడియన్స్ వచ్చి కలెక్షన్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus