Jabardasth show: ఈ పెట్టుడు గొడవలు మీకు అవసరమా సార్లు…!

ఎంటర్‌టైన్మెంట్స్‌ టీవీ ఛానల్స్‌ అందు… ఈటీవీ వేరయా అంటుంటారు టీవీ లవర్స్‌. అందులో వచ్చే కార్యక్రమాలు, రియాలిటీ షోస్‌ కానీ కాస్త పద్ధతిగానే ఉంటాయి. మిగిలిన ఛానల్స్‌తో పోలిస్తే జెన్యూన్‌గా ఉంటాయి. ముఖ్యంగా రియాలిటీ షోస్‌ విషయంలో ఈటీవీ కాస్త బెటర్‌ అనే చెప్పుకోవాలి. కొన్ని ఛానల్స్‌లో కనిపించే… పెట్టుడు గొడవులు, అనవసరమైన హైప్‌లు లాంటివి కనిపించవు. అయితే ఇప్పుడు ఈటీవీ కూఆ ఆ ఛానల్స్‌ తరహాలోకి వెళ్తోందా? ఆ టీవీ ఛానల్‌ నుండి వచ్చిన రీసెంట్‌ ప్రోమోలు చూస్తే… అవుననే అనిపిస్తున్నాయి.

ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్‌’, ‘ఢీ’, ‘క్యాష్‌’ షోస్‌ని మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్‌ రూపొందిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. తెలియనివాళ్లకు అప్పుడప్పుడు ఆ షోస్‌లోనే అన్యాపదేశంగా చెబుతుంటారు కూడా. ఆ షోస్‌లో కాస్త బూతు ధ్వనిస్తుంటుందనేది చాలా పాత విషయం. అయితే ఓవర్‌ యాక్షన్‌ మాత్రం ఎప్పుడూ లేదు. అయితే ఇతర టీవీ ఛానల్స్‌ చూశారో లేక రేటింగ్‌లు తగ్గుతున్నాయని భయపడ్డారో కానీ… ఓవర్‌ యాక్షన్‌ మొదలు పెట్టారు. దీనికి ఇటీవల వచ్చిన ‘ఢీ’, ‘జబర్దస్త్‌’ ప్రోమోలే నిదర్శనం.

‘ఢీ కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ ప్రోమోలో నివేదితో పండు మాస్టర్‌ వచ్చి డ్యాన్స్‌ చేశాడు. అయితే ఆ డ్యాన్స్‌… ప్రియమణికి నచ్చనట్లు, దాంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఓ సీన్‌ క్రియేట్‌ చేశారు. దానిని ప్రోమో కట్‌లో వేశారు. ‘జబర్దస్త్’ ప్రోమో పరిస్థితి కూడా అంతే. ఈ మధ్య సోషల్‌ మీడియాలో హైలైట్‌ అయిన యాంకర్‌ శివ… అనసూయను ఏదో అన్నాడని ఆమె స్టేజీ దిగి వెళ్లిపోయినట్లు ఇంకో సీన్‌ క్రియేట్‌ చేశారు. ఈ రెండూ చూస్తే… అవి నిజం కావు, కావాలని చేశారని అర్థమైపోతుంది. అయితే ఎందుకిలా చేస్తున్నారు అనేదే ఇక్కడ విషయం.

దీనికి సమాధానం… ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్‌ చేయడానికి మాత్రమే అని తెలిసిపోతుంది. అయితే గతంలో ఇలా ఒకసారి జబర్ద్‌స్త్‌లో చేశారు. నాగబాబు, రోజా జడ్జ్‌ సీట్ల నుండి దిగి వెళ్లిపోయినట్లు చూపించారు. అయితే అదంతా స్కిట్‌లో భాగమే అని తేలిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు ఈ చీప్‌ పెట్టుడు గొడవలు చూపిస్తున్నారు. నెంబర్లు తగ్గాయా, డైరక్టర్లకు కొత్త కాన్సెప్ట్‌లు దొరకడం లేదా? అనేది తెలియడం లేదు.


బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus