Bigg Boss Non-Stop: అసలు కిల్లర్ అతడే..! ముగ్గుర్ని ఎలా చంపారంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో కిల్లర్ టాస్క్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఫిజికల్ టాస్క్ కాకుండా ఈసారి హౌస్ మేట్స్ బ్రైయిన్స్ కి పదునుపెట్టాడు బిగ్ బాస్. ఇంట్లో ఒక కిల్లర్ ఉన్నాడని, ఆ కిల్లర్ ఎవరో హౌస్ మేట్స్ గుర్తించాలని చెప్పాడు. అరుపు శబ్దం వినిపించినప్పుడడల్లా హౌస్ మేట్స్ ఒక్కొక్కరు చనిపోతారని చెప్పాడు బిగ్ బాస్. ఇక్కడే ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి వాళ్లు కిల్లర్ కాదన్న విషయం చెప్పాడు.

Click Here To Watch NOW

నటరాజ్ మాస్టర్ కి ఒక సీక్రెట్ ఫోన్ ఇచ్చి హౌస్ లో కిల్లర్ గా మార్చారు. దీంతో నటరాజ్ మాస్టర్ ఎవ్వరికీ అనుమానం రాకుండా హౌస్ మేట్స్ ఒక్కొక్కరినీ చంపుతూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇక్కడే ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు అఖిల్. అఖిల్ టాస్క్ రాకముందే, కిల్లర్ ఎవరో తెలియక ముందే బాత్రూమ్ మిర్రర్ పైన నటరాజ్ మాస్టర్ డెడ్ అంటూ లిప్ స్టిక్ తో రాశాడు.

కేవలం డైవర్ట్ చేసేందుకు ఇలా రాసిన అఖిల్ వల్ల నటరాజ్ మాస్టర్ కి ప్లస్ అయ్యింది. నటరాజ్ మాస్టర్ పేరు ఎందుకు రాశోడో తెలియదు కానీ, ఎవ్వరికీ మాస్టర్ పైన అనుమానం రాకుండా చేసింది. ఆ తర్వాత అఖిల్ లాగానే మిత్రా, అషూలు కూడా మిర్రర్ పైన రాయడం మొదలుపెట్టారు. మిత్రా శర్మా బెడ్ రూమ్ మిర్రర్ పైన ఐయామ్ బ్యాక్ అంటూ రాసింది. అలాగే అషూ బాత్రూమ్ డోర్ పైన నెక్ట్స్ అంటూ రాసి క్వశ్చన్ మార్క్ వేసింది.

ఇంకా నటరాజ్ మాస్టర్ కి టాస్క్ రాకముందే ఇలా హౌస్ మేట్స్ ఫన్నీగా చేయడం అనేది టాస్క్ లో మంచి కిక్ ఇచ్చింది. ఇక నటరాజ్ మాస్టర్ కి బిగ్ బాస్ మూడు టాస్క్ లు ఇచ్చాడు. 1. ఎవరితో అయినా సరే ఉప్పు కలిపిన కాఫీ లేదా టీని తాగించాలి. 2. ఎవరికైనా వారికి తెలియకుండా లిప్ స్టిక్ మరకని అంటించాలి. 3. ఎవరిదైనా బెడ్ పైన నీళ్లు పారబోసి వాళ్లకి చూపించాలి. ఇలా మూడు టాస్క్ లని దిగ్విజయంగా ఎవరికీ అనుమానం రాకుండా చేశాడు నటరాజ్ మాస్టర్.

కానీ, ఫస్ట్ అఖిల్ వాష్ రూమ్ మిర్రర్ పైన నటరాజ్ మాస్టర్ డెడ్ అని రాయడమే మాస్టర్ కి కలిసొచ్చింది. అందుకే, అసలు కిల్లర్ అఖిల్ అయ్యాడు. హౌస్ మేట్స్ కూడా అఖిల్ లేదా అషూ పేర్లే చర్చించుకున్నారు. వీళ్లిద్దరిలోనే కిల్లర్ ఉండచ్చని గట్టిగా నమ్ముతున్నారు. మరి కిల్లర్ టాస్క్ ఎలా ఫినిష్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus