Balayya Babu: ఆ పోలిక బాలయ్య ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోందా?

స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోని సినిమాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన జై బాలయ్య సాంగ్ పై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా బాలయ్య అభిమానులను మాత్రం ఈ సాంగ్ ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం. అయితే తాజాగా విడుదలైన ఈ సాంగ్ ఒక్క మగాడు మూవీ సాంగ్ ను గుర్తు చేసేలా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఒక్క మగాడు మూవీలోని దేవాధి దేవ సాంగ్ ను గుర్తు చేసేలా ఈ సాంగ్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఒక్క మగాడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుందో తెలిసిందే. భారతీయుడు సినిమా తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య సినీ కెరీర్ లో భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఒకటి కావడం గమనార్హం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఏ మాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. బాలయ్య, శృతి హాసన్ కాంబో మూవీ కావడంతో శృతి అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాసినిమాకు శృతి హాసన్ రేంజ్ కూడా పెరుగుతోంది. సీనియర్ హీరోలకు నయనతార తర్వాత శృతి హాసన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.

వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో ఛాన్స్ లు అందుకుంటున్న శృతి హాసన్ ఈ సినిమాలతో ఏ రేంజ్ లో సక్సెస్ లను అందుకుంటారో చూడాల్సి ఉంది. శృతి హాసన్ కు సోషల్ మీడియాలో కూడా భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus