పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా ఒత్తిడి లోనవుతున్నారట. ఆయన సినిమాల షూటింగ్ నిరవధికంగా వాయిదా పడడమే దీనికి కారణం అని సమాచారం. పవన్ రాజకీయాలలో కొనసాగుతూనే మూడు చిత్రాలు ప్రకటించారు. వాటిలో వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇంకా కేవలం 20 రోజులు మాత్రమే మిగిలివుందని సమాచారం. ఇక దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా…షూటింగ్ కూడా కొంత వరకు పూర్తి అయ్యింది.
ఇక ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా కొంచెం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. కాబట్టి క్రిష్ మూవీ పూర్తి కావడానికి ఏడాది సమయం పట్టడం ఖాయం. ఇప్పటికిప్పుడు షూటింగ్ మొదలుపెడితే 2021 సమ్మర్ కి కానీ పూర్తి కాదు. క్రిష్ మూవీ తరువాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తారు. ఆ చిత్రం కోసం కనీసం మరో ఏడాది సమయం పట్టేలా ఉంది. సాధారణ పరిస్థితులు ఏర్పడి షూటింగ్స్ మొదలైతే పవన్ 2022 చివరికల్లా ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసి 2024 ఎన్నికలకు సన్నధం కాగలడు.
ఒక వేళ పూర్తి కాని పక్షంలో, ఒప్పుకున్న సినిమాలు పక్కన పెట్టి పాలిటిక్స్ పై ద్రుష్టి పెడితే, నిర్మాతల నుండి ఆయన తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే విషయం పవన్ ని కలవర పెడుతుందట. ఈసారైనా ఎన్నికలకు పూర్తి సన్నద్దతో వెళ్లకపోతే మరో మారు ఓటమి తప్పదు. అందుకే క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి పవన్ కి కనీసం రెండేళ్ల సమయం కావాలి. అందుకే ఒప్పుకున్న సినిమాలు త్వరితగతిన పూర్తి చేయాలని, పవన్ ప్రణాళికగా పెట్టుకున్నారట.