Chiranjeevi: గోపీచంద్‌ టైటిల్‌ని చిరు తీసుకుంటాడా?

సినిమాకు టైటిల్‌ పెట్టడం ఎంత కష్టమో, ఆ సినిమా పేరు అభిమానులకు నచ్చుతుందా లేదా అని చూసుకోవడమూ అంతే కష్టం. అందుకే సినిమా టైటిల్‌ కోసం కథకు పడేంత శ్రమ పడుతున్నారు మన దర్శకనిర్మాతలు. కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టడం ఆలస్యం… టైటిల్‌ కోసం ఆలోచనలు మొదలుపెడుతున్నారు. తాజాగా ఈ పరిస్థితి చిరంజీవి టీమ్‌కి వచ్చింది. ‘లూసిఫర్‌’ సినిమా రీమేక్‌ కోసం టైటిల్‌ వెతికే పనిలో ఉన్నారు దర్శకుడు మోహన్‌రాజా టీమ్‌. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్‌ టైటిల్ చర్చలోకి వచ్చింది.

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ను మోహన్‌ రాజా దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే చిత్రీకరణ మొదలవుతుంది. ఈ క్రమంలో సినిమా టైటిల్‌ వేట సాగుతుతోంది. ఈ క్రమంలో ‘రారాజు’ అనే పేరు బయటకు వచ్చింది. ఈ పేరు వింటే చిరంజీవికి సరిగ్గా సరిపోయేలా ఉంది కదా. చిరంజీవిని రాజు అని పిలిచిన చాలా సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. మరోవైపు ‘లూసిఫర్‌’ కథ తెలిసినవాళ్లు ‘రారాజు’ అయితే సరిగ్గా సరిపోతుంది అంటారు.

అయితే ఈ సినిమా పేరు వింటే మీకు ఇంకో విషయం కూడా గుర్తొచ్చే ఉంటుంది. ఈ పేరుతో గతంలో ఓ సినిమా వచ్చింది. గోపీచంద్‌ హీరోగా ‘రారాజు’ అనే ఓ సినిమా చేశారు. బాక్సాఫీసు దగ్గర ఆ సినిమా బోల్తా కొట్టేసింది. దీంతో ఫ్లాప్‌ టైటిల్‌ ఎందుకు అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి చిరంజీవి టీమ్‌ ఏం చేస్తుందో చూడాలి.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus