Jr NTR: ఎన్టీఆర్ అభిమానులకే ఇలాంటి కష్టాలు ఎందుకో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ కోరుకున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. తారక్ కొరటాల శివ కాంబో మూవీ జూన్ నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుండగా ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. అయితే మరికొన్ని రోజుల్లో అలియా భట్ పెళ్లి జరగనున్న నేపథ్యంలో అలియా భట్ ఈ సినిమా నుంచి తప్పుకోవచ్చని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అలియా భట్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఆమె తప్పుకునే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ నుంచి క్లారిటీ వస్తే మాత్రమే అలియా భట్ ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీలో కొనసాగుతారో లేదో తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ అప్ డేట్స్ విషయంలో తారక్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఎన్టీఆర్ మినహా మరెవరూ ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వడం లేదు.

ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ ఈ సినిమా గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. కొరటాల శివ తారక్ సినిమాను వేగంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2023 సంవత్సరం ఫస్టాఫ్ లో ఈ సినిమాను విడుదల చేయాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలను ఎప్పుడు మొదలుపెడతారో ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సినిమాసినిమాకు తారక్ నటుడిగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తారక్ కొరటాల కాంబో మూవీ తెరకెక్కనున్నట్టు ప్రచారం జరుగుతున్నా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus