దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వెయ్యి లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ స్థాయిలో థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ ప్రభావం చూపలేదు. కరోనా సోకిన వాళ్లలో చాలామంది హోమ్ ఐసోలేషన్ లోనే కోలుకోవడం గమనార్హం. కరోనా కేసులు తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలు వరుసగా థియేటర్లలో విడుదలవుతుండగా ప్రేక్షకులు సైతం థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నెలలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ థియేటర్లలో రిలీజ్ కానుండగా మార్చి 25వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. దేశవ్యాప్తంగా పెద్ద సినిమాల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే మహారాష్ట్ర రాష్ట్రంలో మాత్రం థియేటర్ల విషయంలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలవుతున్నాయి. ఈ నిబంధన వల్ల ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలకు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలకు హిందీ కలెక్షన్లు కూడా కీలకమనే సంగతి తెలిసిందే.
అటు ప్రభాస్ కు, ఇటు రాజమౌళికి బాహుబలి సిరీస్ సినిమాలతో హిందీలో ఊహించని స్థాయిలో మార్కెట్ పెరిగింది. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు హిందీలో కళ్లు చెదిరే స్థాయిలో బిజినెస్ జరిగింది. రాధేశ్యామ్ రిలీజ్ నాటికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆక్యుపెన్సీ నిబంధనలను సడలిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయంలో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఐపీఎల్ ప్రభావం కొంతమేర పడే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేయగా ఈసారి సినిమాను వాయిదా వేసే పరిస్థితులు కూడా లేవు. రాధేశ్యామ్ తో ప్రభాస్, ఆర్ఆర్ఆర్ తో చరణ్, తారక్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా సక్సెస్ సాధించాలంటే కనీసం 600 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాల్సి ఉంది.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!